Telugu Global
National

బ్యాంకు పనివేళల్లో భారీ మార్పులు

ఆర్థిక మందగమనంతో నష్టాల్లో ఉన్న బ్యాంకులను గట్టెక్కించడం.. లాభాల్లో ఉన్న వాటిని కలిపేయడం ద్వారా బ్యాంకింగ్ సంస్కరణలకు కేంద్రం నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వినియోగదారులకు విస్తృత సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. సంస్కరణలతో ఆగిపోకుండా బ్యాంకులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను బ్యాంకింగ్ వేళల్లో కూడా మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే బ్యాంకుల పనివేళలను మార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. రిజర్వు బ్యాంక్ ఆదేశాల […]

బ్యాంకు పనివేళల్లో భారీ మార్పులు
X

ఆర్థిక మందగమనంతో నష్టాల్లో ఉన్న బ్యాంకులను గట్టెక్కించడం.. లాభాల్లో ఉన్న వాటిని కలిపేయడం ద్వారా బ్యాంకింగ్ సంస్కరణలకు కేంద్రం నడుం బిగించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వినియోగదారులకు విస్తృత సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. సంస్కరణలతో ఆగిపోకుండా బ్యాంకులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను బ్యాంకింగ్ వేళల్లో కూడా మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే బ్యాంకుల పనివేళలను మార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేసి అమలు చేస్తారు. దేశంలోని నాలుగు వందల జిల్లాలో ఈ పనివేళలను మార్చి బ్యాంకులు అమలు చేయడానికి రంగం సిద్ధం చేశాయి.

తాజాగా విజయవాడలోనూ లీడ్ బ్యాంకులు సమావేశమయ్యాయి. ఈ నెల 3 నుంచి 7 దాకా భారత బ్యాంకర్ల సంఘం సూచనల మేరకు పని వేళలు మూడు రకాలుగా విభజించామని రాష్ట్ర బ్యాంకర్ల సమితి కన్వీనర్ కె.వి నాంచారయ్య తెలిపారు.

మొదటి షిఫ్ట్ లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయి. ఇక మరో శాఖలు రెండో షిప్టు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. ఇతర శాకలు మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడుస్తాయి.

ఈ మూడు రకాల పనివేళలను ఆయా బ్యాంకులోని శాఖలు విభజించుకొని ఆయా సమయాల్లో వినియోగదార్లకు సేవలందిస్తాయి. ఇప్పటికే దీనిపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సంప్రదింపుల సమితి… రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘంతో సంప్రదించింది. బ్యాంకులో పని వేళలను ఆమోదించి అమలు చేస్తారు.

ఇక నుంచి రైతులు మొదలుకొని వ్యాపారులు ఇతర వర్గాల వారికి బ్యాంకు రుణాలను వారి వారి రుణ చరిత్రను తెలిపే సిబిల్ స్కోర్ ఆధారంగానే ఇవ్వాలని బ్యాంకర్లు నిర్ణయించాయి. రుణమాఫీతోపాటు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పొందిన రైతులు కూడా సిబిల్ స్కోర్ సరిగా లేకుంటే వారికి రుణాలు ఇవ్వకుండా బ్యాంకర్లు నో చెప్పే ఆస్కారం తాజా నిబంధనతో ఏర్పడింది.

ఇక ప్రకృతి వైపరీత్యాలు, రుణాల రీషెడ్యూల్ వంటి విషయాల్లో సిబిల్ స్కోర్ పై నిర్ణయం తీసుకుని రైతులకు బ్యాంకు మేనేజన్లు రుణాలు ఇవ్వాలి. ఇక తాజాగా ఆంధ్ర బ్యాంక్ విలీనంపై జరుగుతున్న వివాదాల నేపథ్యాల మేనేజ్మెంట్ ఈ విషయంపై స్పందించింది. కేంద్రంలోని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలని.. ఆంధ్రా బ్యాంక్ పేరు మార్చే విషయంలో తామేమీ చేయలేమని ఆంధ్రా బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు.

First Published:  1 Oct 2019 5:28 AM GMT
Next Story