Telugu Global
Cinema & Entertainment

చిరు తో మరోసారి త్రిష ...?

సైరా నరసింహ రెడ్డి సినిమా విడుదల అనంతరం, మెగా స్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా లో నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా జరుగుతుంది. అయితే ఈ సినిమా కి సంబంధించి హీరోయిన్ విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ […]

చిరు తో మరోసారి త్రిష ...?
X

సైరా నరసింహ రెడ్డి సినిమా విడుదల అనంతరం, మెగా స్టార్ చిరంజీవి దర్శకుడు కొరటాల శివ తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా లో నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా జరుగుతుంది.

అయితే ఈ సినిమా కి సంబంధించి హీరోయిన్ విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం త్రిష చిరంజీవి తో జత కట్టే అవకాశం ఉందట.

ఇంతకు ముందు నయనతార, అనుష్క, శృతి హాసన్ పేర్లు వినిపించాయి…. కానీ త్రిష పేరు దాదాపు గా ఖరారైపోయిందని అంటున్నారు. ఒకవేళ త్రిష కనుక ఈ సినిమా లో నటిస్తే, 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించడం జరుగుతుంది. 2006 లో వచ్చిన స్టాలిన్ లో ఈ ఇద్దరూ కలిసి నటించారు.

బాలీవుడ్ సంగీత దర్శకులు అజయ్-అతుల్ ఈ సినిమా కి పని చేయనున్నట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాటినీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణం లో ఈ సినిమా రానుంది.

First Published:  1 Oct 2019 3:06 AM GMT
Next Story