Telugu Global
NEWS

సౌతాఫ్రికాతో తొలిటెస్టుకు విశాఖ రెడీ

రేపటినుంచే తీన్మార్ టెస్ట్ సిరీస్  ఓపెనర్ రోహిత్ శర్మ కు రియల్ టెస్ట్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా…భారత గడ్డపై తొలి సిరీస్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా… స్టీల్ సిటీ విశాఖలోని ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా బుధవారం ప్రారంభమయ్యే తొలిటెస్ట్ లో భారత్ తో సౌతాఫ్రికా ఢీకొనబోతోంది. హాట్ ఫేవరెట్ భారత్…. టెస్ట్ క్రికెట్లో ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్…మరోసారి హాట్ ఫేవరెట్ గా పోటీకి […]

సౌతాఫ్రికాతో తొలిటెస్టుకు విశాఖ రెడీ
X
  • రేపటినుంచే తీన్మార్ టెస్ట్ సిరీస్
  • ఓపెనర్ రోహిత్ శర్మ కు రియల్ టెస్ట్

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా…భారత గడ్డపై తొలి సిరీస్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా… స్టీల్ సిటీ విశాఖలోని ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా బుధవారం ప్రారంభమయ్యే తొలిటెస్ట్ లో భారత్ తో సౌతాఫ్రికా ఢీకొనబోతోంది.

హాట్ ఫేవరెట్ భారత్….

టెస్ట్ క్రికెట్లో ప్రపంచ టాప్ ర్యాంకర్ భారత్…మరోసారి హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలో వరుసగా 10 స్వదేశీ టెస్ట్ సిరీస్ లు నెగ్గడం ద్వారా ఆస్ట్ర్రేలియా రికార్డును సమం చేసిన భారత్… ప్రస్తుత సిరీస్ ద్వారా సరికొత్త రికార్డుకు ఉరకలేస్తోంది. సొంతగడ్డపై 11వ టెస్ట్ సిరీస్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో ఉంది.

గతంలో చివరిసారిగా 2015 సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన సమయంలో సఫారీ జట్టుకు నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 3-0తో పరాజయం తప్పలేదు.

అయితే…గత ఏడాది స్వదేశంలో భారత్ ఆడిన సిరీస్ ను మాత్రం 2-1తో నెగ్గడం ద్వారా సఫారీటీమ్ బదులు తీర్చుకోగలిగింది.

రోహిత్ శర్మకు రియల్ టెస్ట్…

ఇప్పటి వరకూ వన్డే, టీ-20 ఫార్మాట్లలో ఓపెనర్ గా అదరగొట్టిన రోహిత్ శర్మ…సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో సైతం ఓపెనర్ గా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు.

2013లోనే టెస్ట్ అరంగేట్రం చేసినా…మిడిలార్డర్ ఆటగాడిగా ఇప్పటి వరకూ 27 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. గత ఏడాది కంగారుగడ్డపై ఆస్ట్ర్రేలియాతో తన చివరి టెస్ట్ ఆడిన రోహిత్…తిరిగి…విశాఖ టెస్ట్ ద్వారా పునరాగమనం చేయటానికి ఉరకలేస్తున్నాడు.

కర్నాటక యువఓపెనర్ రాహుల్ కు పదేపదే అవకాశాలు కల్పించినా విఫలం కావడంతో…రోహిత్ శర్మ కు ఓపెనర్ గా అవకాశం కల్పించాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

యువఆటగాళ్లతో సౌతాఫ్రికా…

ఓపెనర్ హషీమ్ ఆమ్లా, ఓపెనింగ్ బౌలర్ డేల్ స్టెయిన్ ఈ మధ్యనే రిటైర్మెంట్ ప్రకటించడంతో..డూప్లెసిస్ నాయకత్వంలోని సౌతాఫ్రికా జట్టు పలువు యువఆటగాళ్లకు అవకాశం కల్పించే ఆలోచనలో ఉంది.

సఫారీ ఆటగాళ్లలో డీన్ ఎల్గర్, టెంబా బవుమా, డీ బ్రూయిన్, క్వింటన్ డీ కాక్, హంజా, కేశవ్ మహారాజ్, ఏడెన్ మార్కరమ్, సేనురాన్ ముత్తుస్వామి, లుంగీ ఎన్ గిడీ, నోర్జే, ఫిలాండర్, డేన్ పిడిట్, కగీసో రబాడా, రూడా సెకెండ్ ఉన్నారు.

సఫారీజట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు డూప్లెసిస్, ఎల్గర్, డి కాక్, ఫిలాండర్, రబాడా మాత్రమే ఉన్నారు.

2013 నుంచి స్వదేశీ టెస్టు సిరీస్ ల్లో పరాజయం లేని భారత్…వరుసగా 11వ సిరీస్ విజయానికి గురిపెట్టింది. స్వదేశీ గడ్డపై అత్యంత శక్తిమంతమైన భారత్ ను.. సౌతాఫ్రికా ఎంతవరకూ నిలువరించగలదన్నది అనుమానమే.

First Published:  1 Oct 2019 5:30 AM GMT
Next Story