ఒలింపిక్స్ కు భారత మిక్సిడ్ రిలే జట్టు అర్హత

  • ప్రపంచ రిలే పోటీలలో భారత్ కు 7వ స్థానం

టోక్యో వేదికగా వచ్చే ఏడాది జరిగే 2020 ఒలింపిక్స్ 400 మీటర్ల మిక్సిడ్ రిలే విభాగంలో తలపడటానికి భారత జట్టు అర్హత సంపాదించింది.

దోహా వేదికగా ముగిసిన 2019 ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల ఫైనల్స్ కు అర్హత సాధించడంతోనే భారతజట్టు ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

పతకం రేస్ లో తలపడిన మొత్తం ఎనిమిదిజట్లలో భారత్ 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం… ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ రిలే మొదటి ఎనిమిది స్థానాలలో నిలిచిన జట్లకు ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

భారత జట్టు 3 నిముషాల 15. 77 సెకన్ల టైమింగ్ తో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పడమే కాదు…ఒలింపిక్స్ కు సైతం అర్హత సంపాదించగలిగింది.

భారత రిలే జట్టులో మహ్మద్ అనాస్ యాహ్యా, విస్మయ, జిస్నా మాథ్యూ, టామ్ నోవా సభ్యులుగా ఉన్నారు.

మిక్సిడ్ రిలే విభాగంలో అమెరికా జట్టు 3 నిముషాల 09.34 సెకన్ల టైమింగ్ తో సరికొత్త ప్రపంచ రికార్డుతో పాటు బంగారు పతకం అందుకొంది.