Telugu Global
NEWS

టెస్ట్ క్రికెట్లో ఇక ఓపెనర్ గా రోహిత్ శర్మ

విశాఖ వేదికగా రోహిత్ కు బిగ్ టెస్ట్ వన్డే, టీ-20 ఫార్మాట్లలో పరుగుల మోత మోగించిన భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ… టెస్ట్ క్రికెట్లోనూ ఇక ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు. పదేపదే అవకాశాలు ఇస్తున్నా…. వరుస వైఫల్యాలతో సెలెక్టర్ల సహనానికి పరీక్ష పెట్టిన యువ ఓపెనర్ కెఎల్ రాహుల్ స్థానంలో రోహిత్ శర్మకు ఓపెనర్ గా అవకాశమిచ్చారు. రాహుల్ పోయే…రోహిత్ వచ్చే… 2018 సీజన్ నుంచి ఆడిన మొత్తం 36 టెస్టు మ్యాచ్ ల్లో…రాహుల్ గత […]

టెస్ట్ క్రికెట్లో ఇక ఓపెనర్ గా రోహిత్ శర్మ
X
  • విశాఖ వేదికగా రోహిత్ కు బిగ్ టెస్ట్

వన్డే, టీ-20 ఫార్మాట్లలో పరుగుల మోత మోగించిన భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ… టెస్ట్ క్రికెట్లోనూ ఇక ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు. పదేపదే అవకాశాలు ఇస్తున్నా…. వరుస వైఫల్యాలతో సెలెక్టర్ల సహనానికి పరీక్ష పెట్టిన యువ ఓపెనర్ కెఎల్ రాహుల్ స్థానంలో రోహిత్ శర్మకు ఓపెనర్ గా అవకాశమిచ్చారు.

రాహుల్ పోయే…రోహిత్ వచ్చే…

2018 సీజన్ నుంచి ఆడిన మొత్తం 36 టెస్టు మ్యాచ్ ల్లో…రాహుల్ గత ఏడు టెస్టుల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ సాధించలేక జట్టుకే భారంగా మారాడు.

అంతేకాదు..గత రెండేళ్లలో శిఖర్ ధావన్, మురళీ విజయ్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, హనుమ విహారీ, పార్థివ్ పటేల్, రాహుల్ లను ఓపెనర్లుగా ఆడించినా నిలదొక్కుకోలేకపోడం భారతజట్టు టీమ్ మేనేజ్ మెంట్ కు తలనొప్పిగా మారింది.

టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుకు కుదురైన, నమ్మదగిన ఓపెనింగ్ జోడీ లేకపోడం ఆందోళనకు గురిచేసింది. దీంతో సౌతాఫ్రికాతో విశాఖ వేదికగా బుధవారం ప్రారంభంకానున్న తీన్మార్ టెస్టు సిరీస్ లో రోహిత్ శర్మను ఓపెనర్ గా దించాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

వన్డేలు, టీ-20ల్లో తిరుగులేని రోహిత్…

వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు, వన్డే ప్రపంచకప్ లో ఐదు శతకాలు బాదిన అరుదైన ఘనత రోహిత్ కు ఉంది. అంతేకాదు.. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన అతికొద్దిమంది ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు.

తన కెరియర్ లో రోహిత్ గత ఆరేళ్ల కాలంలో.. ఇప్పటి వరకూ ఆడిన 27 టెస్టుల్లో 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. మిడిలార్డర్ లోనే రోహిత్ 1585 పరుగులు సాధించడం విశేషం.

అయితే…విజయనగరం వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన సన్నాహక ప్రాక్టీసు మ్యాచ్ లో రోహిత్ శర్మ ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగి డకౌట్ గా వెనుదిరిగాడు.

ప్రస్తుతం మిడిలార్డర్లో అజింక్యా రహానే, హనుమ విహారీ నిలదొక్కుకోడంతో…రోహిత్ ను ఓపెనర్ గా దించాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

మయాంక్ అగర్వాల్ తో కలసి రోహిత్ శర్మ భారత బ్యాటింగ్ ప్రారంభించనున్నాడు.

సౌతాఫ్రికా జట్టు లో రబాడా, ఫిలాండర్ లాంటి ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లున్నారు. లెప్టామ్ స్పిన్నర్ మాధవ్ మహారాజ్ సైతం భారత్ కు సవాల్ విసురుతున్నాడు.

విశాఖ టెస్ట్ మ్యాచ్ బుధవారం నుంచి ఐదురోజులపాటు జరుగనుంది.

First Published:  1 Oct 2019 5:36 AM GMT
Next Story