Telugu Global
National

మహాత్మా గాంధీ స్వప్నాన్ని నిజం చేస్తున్న జగన్

దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇంతకు ముందు ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గ్రామ సచివాలయ వ్యవస్థ అన్ని కీలకమైన ప్రభుత్వ శాఖ ఉద్యోగులతోనూ ఏర్పాటవుతూ కొత్త పరిపాలన విధానానికి నాంధి పలుకుతోంది. రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖలు ఒకే చోట ఉన్న విధంగా గ్రామ స్థాయిలో కూడా అదే విధమైన పద్ధతి ఒకే కార్యాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామ, పట్టణ స్థాయిల్లో సచివాలయ ఉద్యోగాలు భర్తీ […]

మహాత్మా గాంధీ స్వప్నాన్ని నిజం చేస్తున్న జగన్
X

దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇంతకు ముందు ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గ్రామ సచివాలయ వ్యవస్థ అన్ని కీలకమైన ప్రభుత్వ శాఖ ఉద్యోగులతోనూ ఏర్పాటవుతూ కొత్త పరిపాలన విధానానికి నాంధి పలుకుతోంది.

రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖలు ఒకే చోట ఉన్న విధంగా గ్రామ స్థాయిలో కూడా అదే విధమైన పద్ధతి ఒకే కార్యాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో ఏపీ కొత్త పుంతలు తొక్కుతోంది. గ్రామ, పట్టణ స్థాయిల్లో సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయడం ద్వారా ఒకేసారి దాదాపు లక్షా 30 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రధానమైన శాఖలకు సంబంధించిన బాధ్యులు గ్రామంలోనే ప్రజలకు అందుబాటులో ఉండే విధానాన్ని అక్టోబర్‌ 2 నుంచి ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఇప్పటికే ఎంపికైనవారికి నియామక పత్రాలు అందచేశారు. గ్రామ సచివాలయ ఏర్పాటు ద్వారా గ్రామ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచన నుంచి పుట్టిన సచివాలయ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. మేనిఫేస్టోలోని ప్రతి హామీ అమలుకు సీఎం శ్రీకారం చుట్టారు.

ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మే 30న ప్రమాణ స్వీకారం చేస్తూ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని ఆచరణలో పెడుతూ గ్రామ సచివాలయాలకు అంకురార్పణ చేశారు. గ్రామాల్లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలిసి గ్రామ స్వరాజ్యం వైపు వైసీపీ సర్కార్‌ అడుగు వేసింది. రికార్డు స్థాయిలో లక్షా 26 వేల 728 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డి ఎంపికైన వారందరికీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ జిల్లాల వారిగా అందచేశారు.

గాంధీ జయంతి అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయాలు పల్లెపల్లెన జనం కష్టనష్టాలను తీర్చేపనిలో నిమగ్నమవుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ తరహాలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ తొలిసారిగా ఏపీలోనే ప్రారంభమైంది. ప్రతి యాబై కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్, మున్సిపాలిటీల్లో వార్డు వాలంటీర్లను నియమించడం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చేందుకు గ్రామ సచివాలయాలను జగన్‌ ప్రారంభించారు.

నవరత్నాలతో పాటు మేనిఫేస్టోలో చెప్పిన అంశాలను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో గ్రామ సచివాలయాల పనితీరుపై తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్‌ నుండే పరిశీలించనున్నారు. ప్రతి సచివాలయంలో పదకొండు నుంచి పన్నెండు మంది ఉద్యోగులు పనిచేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 ఉద్యోగులతో కొత్త వ్యవస్థను సృష్టించడం వల్ల ప్రభుత్వ పథకాలు అర్హులకు ఇంటింటికీ చేరేలా పకడ్బంధీంగా జగన్‌ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు గాంధీ జయంతి నాటి నుంచి ప్రారంభమవుతున్నాయి.

కులం, మతం, ప్రాంతం చూడం, పార్టీలకు అతీతంగా గ్రామవాలంటీర్లు పనిచేస్తారని, అలాగే ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ గ్రామ సచివాలయాల ద్వారా అందచేస్తామని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పదేపదే చెబుతున్నారు. సొంత గ్రామాల్లో ఉండేవారు పక్షపాతంగా పనిచేస్తారనే ముందుచూపుతో నియామక పత్రాలు కూడా ఎంపికైనా ఉద్యోగి స్థానిక గ్రామం కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో నియమించారు. దీంతో గ్రామాల్లో వర్గ విభేదాలు లేకుండా ప్రతీ ఒక్కరికీ వైసీపీ సంక్షేమ పథకాలు చేరేలా గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పనిచేస్తారు.

ప్రభుత్వం ఒకవైపు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను సృష్టించి లక్షా 26వేల మందికిపైగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని టిడిపి అధినేత చంద్రబాబు ప్రతీ నిమిషం తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామ వాలంటీర్లు వెళ్లి డోర్లు కొడతారు అంటూ స్థాయిని తగ్గించుకొని వ్యాఖ్యలు చేశారు.

దీంతో మాజీ ముఖ్యమంత్రి నోటి తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. అయిదేళ్ల అధికారంలో నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగ కల్పన చేయకుండా చేతులెత్తేసిన చంద్రబాబు గ్రామ వాలంటీర్ల వ్యక్తిత్వాలను కించపరుస్తూ మాట్లాడడం, మహిళల శీలాలను శంకించే విధంగా దూషించడం మాజీ ముఖ్యమంత్రి రాజకీయ దుస్థితికి అద్దం పడుతోంది.

జాబు రావాలంటే బాబు రావాలనే ప్రకటనకు మాత్రమే పరిమితమైన చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో ఘోరంగా విఫలమయింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం లక్షా 25 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వడంతో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు బృందం కారుకూతలు కూస్తున్నారు.

ఒకవేళ పేపర్‌ లీక్ అయితే అది పరీక్షా జరిగిన రోజే బట్టబయలు అవుతుంది. ప్రజల్లో కూడా దానిపై వ్యతిరేకత, ఆందోళన మొదలవుతాయి. ఫలితాలు వచ్చాక తన జాతి మీడియాతో చంద్రబాబు రాయించిన పచ్చ పబ్లిసిటీ పనులు విజయవంతం కాలేదు. దీంతో గ్రామవాలంటీర్లు, సచివాలయ సిబ్బందిపై చంద్రబాబు అండ్‌ కో భవిష్యత్తులో ఎన్ని నిందలు వేయడానికైనా వెనుకాడరు.

దేశంలో ఏ కొత్త విధానం/వ్యవస్థనైనా ప్రజలు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. అలాగే గ్రామ సచివాలయ, వాలంటీర్ల పనితీరు ఫలితాలు రావడానికి కూడా ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. ప్రజలు ఆశీర్వదించి సొంతం చేసుకుంటే గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌ నుంచే ప్రారంభమై దేశ వ్యాప్తంగా అమలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

First Published:  1 Oct 2019 2:44 AM GMT
Next Story