Telugu Global
NEWS

మా అన్నని కాపాడండి సర్‌... చలించిపోయిన సీఎం జగన్‌... 15లక్షలు మంజూరు

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న ఇద్దరు చిన్నారులు రేణుగుంట విమానాశ్రయానికి వచ్చారు. తన అన్నను కాపాడాలని కోరారు. దీంతో సీఎం చలించిపోయారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవకర్గానికి చెందిన చాందిని, రజనీ అనే ఇద్దరు చిన్నారులు … తమ బాధను సీఎంకు వివరించేందుకు వచ్చారు. కొన్నేళ్ల క్రితం వీరి అన్న స్కూల్ భవనంపై నుంచి కింద పడ్డాడు. దాంతో రెండేళ్ల పాటు కోమాలో ఉండిపోయాడు. తర్వాత కోమా నుంచి […]

మా అన్నని కాపాడండి సర్‌... చలించిపోయిన సీఎం జగన్‌... 15లక్షలు మంజూరు
X

తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న ఇద్దరు చిన్నారులు రేణుగుంట విమానాశ్రయానికి వచ్చారు. తన అన్నను కాపాడాలని కోరారు. దీంతో సీఎం చలించిపోయారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజవకర్గానికి చెందిన చాందిని, రజనీ అనే ఇద్దరు చిన్నారులు … తమ బాధను సీఎంకు వివరించేందుకు వచ్చారు. కొన్నేళ్ల క్రితం వీరి అన్న స్కూల్ భవనంపై నుంచి కింద పడ్డాడు. దాంతో రెండేళ్ల పాటు కోమాలో ఉండిపోయాడు. తర్వాత కోమా నుంచి బయటకు వచ్చినా ఇంకా మంచానికే పరిమితం అయ్యాడు.

తమ అన్న కోలుకోవాంటే నాలుగు ఆపరేషన్లు చేయాలని వైద్యులు చెబుతున్నారని… తమ వద్ద అంత డబ్బు లేదని సాయం చేయాలని సీఎంను కోరేందుకు వచ్చారు. చిన్నారులను పిలిచి మాట్లాడిన సీఎం… వారి పరిస్థితిని చూసి చలించిపోయారు.

మీ అన్నను కాపాడుతాం అని ధైర్యం చెప్పారు. చిన్నారుల సోదరుడి వైద్యం కోసం తక్షణం 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇద్దరు చిన్నారుల చదువు , కుటుంబం కోసం మరో ఐదు లక్షలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి స్పందన పట్ల చిన్నారులు హర్షం వ్యక్తం చేశారు.

సాయం కోసం తాము కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చామని కానీ సాయం చేయలేదని… సీఎం జగన్‌ తక్షణం స్పందించడంతో తమకు ధైర్యం వచ్చిందని చిన్నారులు చెప్పారు.

First Published:  1 Oct 2019 2:42 AM GMT
Next Story