Telugu Global
Cinema & Entertainment

అప్పుడు అక్షయ్.... ఇప్పుడు అనిల్ కపూర్

ఈ మధ్యనే ‘2.O’ వంటి భారీ బడ్జెట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇప్పుడు 1996 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ తో బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ‘భారతీయుడు 2’ అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, సిద్ధార్థ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు […]

అప్పుడు అక్షయ్.... ఇప్పుడు అనిల్ కపూర్
X

ఈ మధ్యనే ‘2.O’ వంటి భారీ బడ్జెట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇప్పుడు 1996 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ తో బిజీగా ఉన్నారు.

కమల్ హాసన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ‘భారతీయుడు 2’ అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, సిద్ధార్థ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు శంకర్ బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ని ఎంపిక చేయాలని ప్రయత్నిస్తున్నారట.

ఈ విషయంలో త్వరలో శంకర్… అనిల్ కపూర్ ని సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో 20 ఏళ్లక్రితం శంకర్ మొదటి హిందీ సినిమా అయిన నాయక్ లో అనిల్ కపూర్ హీరో గా నటించాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ముదల్వన్’ (తెలుగులో ఒకే ఒక్కడు) సినిమా రీమేక్ ఇది.

ఇంతకుముందు ‘2.O’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని విలన్ గా మార్చిన శంకర్ ఇప్పుడు ‘ఇండియన్ 2’ సినిమాతో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ని విలన్ గా మార్చబోతున్నాడు. మరి అనిల్ కపూర్ ఈ పాత్రని ఒప్పుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుంది.

First Published:  1 Oct 2019 11:21 PM GMT
Next Story