Telugu Global
Cinema & Entertainment

ఆ పాట కాపీ కొట్టారు.... దేవి శ్రీ ప్రసాద్ లీగల్ గా ముందుకెళ్తాడా?

ఈ మధ్యనే ‘2.0’ సినిమా లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇప్పుడు త్వరలో ‘హౌస్ ఫుల్ 4’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫర్హద్ సంజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హౌస్ ఫుల్ సిరీస్ లోని నాలుగవ భాగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే అక్టోబర్ 25న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ మధ్యనే విడుదల చేశారు. అందరూ ట్రైలర్ లో వాడిన మ్యూజిక్ […]

ఆ పాట కాపీ కొట్టారు.... దేవి శ్రీ ప్రసాద్ లీగల్ గా ముందుకెళ్తాడా?
X

ఈ మధ్యనే ‘2.0’ సినిమా లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇప్పుడు త్వరలో ‘హౌస్ ఫుల్ 4’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఫర్హద్ సంజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హౌస్ ఫుల్ సిరీస్ లోని నాలుగవ భాగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే అక్టోబర్ 25న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ మధ్యనే విడుదల చేశారు. అందరూ ట్రైలర్ లో వాడిన మ్యూజిక్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ లోని ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ మ్యూజిక్ లాగా ఉంది అని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పాట కి సంగీతాన్ని అందించిన దేవిశ్రీప్రసాద్ ‘హౌస్ ఫుల్ 4’ సినిమా చిత్ర బృందం పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నాడట.

అయితే చిత్ర నిర్మాత అయిన సాజిద్ నడియాడ్వాలా దేవిశ్రీ ప్రసాద్ కి మ్యూజిక్ క్రెడిట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి దేవిశ్రీప్రసాద్ ఏం చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.

రితేష్ దేశ్ ముక్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్, కృతి కర్బంద మరియు పూజా హెగ్డే లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

First Published:  1 Oct 2019 10:33 PM GMT
Next Story