Telugu Global
NEWS

భారత గడ్డపై సౌతాఫ్రికాకు కత్తిమీద సాము

భారత గడ్డపై 6 టెస్ట్ సిరీస్ ల్లో సఫారీలకు ఒక్కటే గెలుపు 2008 సిరీస్ లో చెన్నై వేదికగా వీరూ 319 పరుగులు భారత గడ్డపై 7వసారి టెస్ట్ సిరీస్ లో సౌతాఫ్రికా జట్టు తన అదృష్టం పరీక్షించుకొంటోంది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా మరి కొద్దిగంటల్లో ప్రారంభంకానున్న మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ప్రపంచ నంబర్ వన్ భారత్ కు సవాలు విసురుతోంది. 1999 నుంచి 2015 సిరీస్ ల వరకూ భారత […]

భారత గడ్డపై సౌతాఫ్రికాకు కత్తిమీద సాము
X
  • భారత గడ్డపై 6 టెస్ట్ సిరీస్ ల్లో సఫారీలకు ఒక్కటే గెలుపు
  • 2008 సిరీస్ లో చెన్నై వేదికగా వీరూ 319 పరుగులు

భారత గడ్డపై 7వసారి టెస్ట్ సిరీస్ లో సౌతాఫ్రికా జట్టు తన అదృష్టం పరీక్షించుకొంటోంది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా మరి కొద్దిగంటల్లో ప్రారంభంకానున్న మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ప్రపంచ నంబర్ వన్ భారత్ కు సవాలు విసురుతోంది.

1999 నుంచి 2015 సిరీస్ ల వరకూ భారత గడ్డపై ఆడిన ఆరు టెస్ట్ సిరీస్ ల్లో సఫారీజట్టు ఒక్క గెలుపు, రెండు డ్రా, 3 పరాజయాల రికార్డుతో ఉంది.

1999-2000 టెస్ట్ సిరీస్ ను 2-0తో నెగ్గిన సౌతాఫ్రికా…2007-08, 2009-10 సిరీస్ లను సైతం డ్రాగా ముగించగలిగింది.
2015 టెస్ట్ సిరీస్ లో భారత్ 3-0తో సౌతాఫ్రికాను చిత్తు చేసి…స్వదేశంలో తన ఆధిక్యాన్ని చాటుకొంది.

టాప్ స్కోరర్ వీరేంద్ర సెహ్వాగ్…

భారత్- సౌతాఫ్రికా టెస్ట్ ద్వైపాక్షిక సిరీస్ ల్లో టాప్ స్కోరర్ గా నిలిచిన ఘనత భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు మాత్రమే దక్కుతుంది.

2008 సిరీస్ లో భాగంగా చెన్నై వేదికగా ముగిసిన టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. కేవలం 278 బాల్స్ లోనే 319 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్లో ఇదే అత్యంత వేగంగా సాధించిన త్రిశతకంగా నమోదయ్యింది.

2010 సిరీస్ లో భాగంగా నాగపూర్ వేదికగా ముగిసిన టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాపార్డర్ ఆటగాడు హషీమ్ ఆమ్లా
253 నాటౌట్ స్కోరుతో తనజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించడమే కాదు…భారత గడ్డపైన అత్యధిక టెస్టు స్కోరు సాధించిన సఫారీ క్రికెటర్ గా నిలిచాడు.

2008లో డివిలియర్స్ షో..

2008 సిరీస్ లో భాగంగా ..అహ్మదాబాద్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో ఏబీ డివిలియర్స్ 217 నాటౌట్ గా నిలవడం ద్వారా సిరీస్ ను డ్రాగా ముగించడంలో ప్రధానపాత్ర వహించాడు.

2010లో నాగపూర్ టెస్టులోనే జాక్ కలిస్ 173 పరుగులు, 2010లో కోల్ కతా టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ 165 పరుగులు సాధించిన క్రికెటర్లుగా నిలిచారు.

First Published:  1 Oct 2019 9:54 PM GMT
Next Story