Telugu Global
Cinema & Entertainment

వెబ్ సిరీస్ ట్రైలర్ తో ఆకట్టుకున్న సత్యదేవ్

‘బ్లఫ్ మాస్టర్’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాలో కనిపించిన సత్యదేవ్ ఇప్పుడు త్వరలో ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి (G.O.D) అనే ఒక వెబ్ సిరీస్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ నటుడు అనీష్ కురువిల్లా ఈ వెబ్ సిరీస్ లో ముఖ్యపాత్ర పోషించడం మాత్రమే కాక దర్శకత్వం కూడా వహించాడు. రాజ్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో శ్రుతి మరియు చాందిని చౌదరి లు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ […]

వెబ్ సిరీస్ ట్రైలర్ తో ఆకట్టుకున్న సత్యదేవ్
X

‘బ్లఫ్ మాస్టర్’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాలో కనిపించిన సత్యదేవ్ ఇప్పుడు త్వరలో ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి (G.O.D) అనే ఒక వెబ్ సిరీస్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రముఖ నటుడు అనీష్ కురువిల్లా ఈ వెబ్ సిరీస్ లో ముఖ్యపాత్ర పోషించడం మాత్రమే కాక దర్శకత్వం కూడా వహించాడు. రాజ్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో శ్రుతి మరియు చాందిని చౌదరి లు హీరోయిన్లుగా నటించారు.

తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ వీడియో చూస్తే వెబ్ సిరీస్ కథ ఎలా ఉండబోతోందనేది అర్థమవుతుంది.

ఈ వెబ్ సిరీస్ 1960 మరియు 1970 లలో మైనింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ మరియు కర్ణాటక మధ్య ఉండే ధర్మపురి అనే ఒక గ్రామంలో రాజకీయ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.

ఈ వెబ్ సిరీస్ లో మంచి ప్రేమ కథ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఏళ్లన్నర్ ఫిలిమ్స్ పతాకంపై లక్ష్మి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ జి5 లో అక్టోబర్ 23న విడుదల కాబోతుంది. మరి ఈ వెబ్ సిరీస్ తో సత్యదేవ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.

First Published:  2 Oct 2019 12:51 AM GMT
Next Story