Telugu Global
Cinema & Entertainment

'సైరా నరసింహా రెడ్డి' సినిమా రివ్యూ

రివ్యూ : సై రా నరసింహా రెడ్డి రేటింగ్ : 3/5 తారాగణం : చిరంజీవి, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ కిచ్చా, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, బ్రహ్మాజీ తదితరులు సంగీతం : అమిత్ త్రివేది నిర్మాత : రామ్ చరణ్ (కొణిదెల ప్రొడక్షన్స్) దర్శకత్వం : సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి హీరో గా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. స్వాతంత్ర్య సమర యోధుడు […]

సైరా నరసింహా రెడ్డి సినిమా రివ్యూ
X

రివ్యూ : సై రా నరసింహా రెడ్డి
రేటింగ్ : 3/5
తారాగణం : చిరంజీవి, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ కిచ్చా, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : అమిత్ త్రివేది
నిర్మాత : రామ్ చరణ్ (కొణిదెల ప్రొడక్షన్స్)

దర్శకత్వం : సురేందర్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి హీరో గా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబచ్చన్, నయనతార, సుదీప్, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్ నటీ నటులు ముఖ్యపాత్రలు పోషించారు.

సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వచ్చాయి. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ స్వయంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈరోజు విడుదలైంది.

కథ:

సినిమా మొత్తం 1847 బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది. ఆ కాలంలో ఉండే పాలెగాళ్ళ లో ఒకరయిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఇది. సినిమా 1847 తో మొదలవుతుంది. నరసింహారెడ్డి (మెగాస్టార్ చిరంజీవి) ఒక పాలెగాడు. బ్రిటిషర్ల వద్ద పనిచేస్తూ వారికి పన్ను కడుతూ ఉంటారు.

రాయలసీమ ప్రాంతంలో ఉన్న 61 పాలెగాళ్లలో నరసింహ రెడ్డి కూడా ఒకరు. అయితే ఒకసారి రాయలసీమలో చాలా పెద్ద కరువు ఏర్పడుతుంది. కానీ అలాంటి సమయంలో కూడా బ్రిటిషర్లు భూమి పన్ను కట్టాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేస్తారు.

ఇక్కడే నరసింహ రెడ్డి కి, బ్రిటీషర్ల కి మధ్య గొడవ మొదలవుతుంది. ఆ తర్వాత నరసింహ రెడ్డి…. అవుక రాజు, రాజా పాండి వంటి ఇతర రాజులు ప్రజలతో కలిసి ఎలా బ్రిటీషర్ల పై తిరుగుబాటు చేశారు? చివరికి ఏమైంది? అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు:

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు ఊపిరి పోశారు. తన అద్భుతమైన నటనతో చిరంజీవి తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో చిరంజీవి నటన చాలా బాగుంటుంది.

ఏ పాత్రలోనైనా సులువుగా ఒదిగి పోగల నటుడు విజయ్ సేతుపతి. ఈ సినిమాలో కూడా తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించాడు.

సుదీప్ కిచ్చా కూడా అతని పాత్రలో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు.

అమితాబచ్చన్ తెరమీద కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆయన పాత్ర ప్రేక్షకుల పై మంచి ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా అమితాబ్ నటన ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది.

నయనతార, తమన్నా కేవలం తమ అందచందాలతో మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ తో కూడా ఆకర్షించారు. కానీ వారి పాత్రలు పెద్దగా పండలేదు అనే చెప్పుకోవాలి. జగపతిబాబు మరియు బ్రహ్మాజీ కూడా చాలా సహజంగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు కథను నెరేట్ చేసిన విధానం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. స్టార్ నటీనటులను ఎంపిక చేసుకోవడం మాత్రమే కాక దర్శకుడు సురేందర్ రెడ్డి అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కథని చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళాడు.

ఇప్పటిదాకా చరిత్రపుటల్లో మాత్రమే మిగిలిపోయిన ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడి కథని వెండితెరపై చూపించటం అంత సులువైన విషయం కాదు. కానీ సురేందర్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని తెరపై ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. అయితే ఫస్ట్ హాఫ్ లో నెరేషన్ స్లో గా ఉంది.

కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ అందించిన నిర్మాణ విలువలు సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అమిత్ త్రివేది ఈ సినిమాకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. జూలియస్ ప్యాకీయం నేపధ్య సంగీతం సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయింది.

రత్నవేలు కెమెరా యాంగిల్స్ సినిమాకి ఆయువుపట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలలో రత్నవేలు పనితనం సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. సాయిమాధవ్ బుర్రా అందించిన డైలాగులు సినిమాకి వెన్నెముక గా మారాయి. ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది.

బలాలు:

కథ, నటీనటులు, సంగీతం, అద్భుతమైన విజువల్స్

బలహీనతలు:

బ్రిటీషర్లతో కొన్ని సన్నివేశాలు, ఫస్ట్ హాఫ్

చివరి మాట:

నటీనటుల పర్ఫామెన్స్ మాత్రమే కాకుండా సినిమా కోసం టెక్నికల్ బృందం పడ్డ కృషి కూడా ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. అనుకున్న విధంగానే మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీని చాలా అద్భుతంగా చిత్రీకరించారు.

ఫస్ట్ హాఫ్ మొత్తం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషర్ల పై ఎందుకు ఎదురు తిరగాల్సి వస్తుంది…. అతనికి ఎవరు సహాయం చేశారు…. వంటి విషయాల చుట్టూ తిరుగుతుంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ స్లో గా ఉండడం మైనస్ పాయింట్. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం చాలా బాగుంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బృందం, బ్రిటిషర్ల మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలు చాలా బాగున్నాయి. సినిమాలోని విజువల్స్ ఖచ్చితంగా ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమాలోని ప్రతి డైలాగ్ ప్రేక్షకులను మెప్పించింది.

ఇక సెకండ్ హాఫ్ లోని కోర్టు సీన్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఉరి వేసే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

First Published:  2 Oct 2019 3:08 AM GMT
Next Story