Telugu Global
NEWS

"చంద్రబాబు మాటలు విని నేను పరీక్ష రాయలేదు"- బోరున విలపించిన విద్యార్థిని

గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో ఏదో జరిగిందని టీడీపీ మీడియా, చంద్రబాబు పెద్దెత్తున విమర్శలు చేసినా అవేవి నిలబడడం లేదు. గ్రామాల్లో ఉద్యోగాలు వచ్చిన వారిలో టీడీపీ వారు కూడా ఉన్నారు. జనసేన కుటుంబాలకు చెందిన పిల్లలు ఉద్యోగాలు సాధించారు. గుంటూరు జిల్లాలో టీడీపీ పత్రిక విలేకరి కుమార్తె గ్రామ సచివాలయం ఉద్యోగం సాధించింది. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఇనివెళ్ల గ్రామ టీడీపీ నేత వెంకటకోటయ్య కుమార్తె పంచాయతీ కార్యదర్శి పోస్ట్ సాధించింది. టీడీపీ కార్యక్రమాల్లో డప్పు […]

చంద్రబాబు మాటలు విని నేను పరీక్ష రాయలేదు- బోరున విలపించిన విద్యార్థిని
X

గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో ఏదో జరిగిందని టీడీపీ మీడియా, చంద్రబాబు పెద్దెత్తున విమర్శలు చేసినా అవేవి నిలబడడం లేదు. గ్రామాల్లో ఉద్యోగాలు వచ్చిన వారిలో టీడీపీ వారు కూడా ఉన్నారు. జనసేన కుటుంబాలకు చెందిన పిల్లలు ఉద్యోగాలు సాధించారు. గుంటూరు జిల్లాలో టీడీపీ పత్రిక విలేకరి కుమార్తె గ్రామ సచివాలయం ఉద్యోగం సాధించింది.

వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఇనివెళ్ల గ్రామ టీడీపీ నేత వెంకటకోటయ్య కుమార్తె పంచాయతీ కార్యదర్శి పోస్ట్ సాధించింది. టీడీపీ కార్యక్రమాల్లో డప్పు వాయిస్తూ డ్యాన్సులు చేసే నాగరాజు అనే వ్యక్తి కూడా సచివాలయ ఉద్యోగం సాధించాడు. అతడి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది.

కర్లపాలెం మండలం టీడీపీ నాయకుడు నక్కల శేషాద్రి కుమారుడు గోపి పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాడు. పరీక్షలు పారదర్శకంగా జరిగాయని అందుకే తనకు ఉద్యోగం వచ్చిందని గోపి అభిప్రాయపడ్డాడు.

తెనాలి మండలం కొలకలూరులో టీడీపీ క్రియాశీల కార్యకర్తగా ఉన్న గాజుపర్తి సాంబశివరావు వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు. గతంలో జాబు రావాలంటే బాబు రావాలంటూ ఇతడు పెద్దెత్తున ప్రచారం చేశాడు.

ఫిరంగిపురం మండలం గుండాలపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త షేక్ ఖాజా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్‌-2 ఉద్యోగం సాధించాడు. ఇలా అనేక మంది టీడీపీ వాళ్లు గ్రామ సచివాలయం ఉద్యోగాలు సాధించారు.

అయితే తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన ఒక యువతి పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. గ్రామంలో పలువురు ఉద్యోగాలు సాధించగా… వారి వద్దకు ఒక యువతి వచ్చింది. ఉద్యోగం సాధించిన ఒక యువతి తల్లి… సదరు అమ్మాయిని పలకరించింది. ”నీవు చదువులో ఫస్ట్‌ కదా.. నీవు పరీక్ష రాసి ఉంటే ఉద్యోగం వచ్చేది కదమ్మా” అని మహిళ ఆరా తీసింది.

దాంతో సదరు విద్యార్థిని బోరున విలపించింది. ”మా నాన్న తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు చెప్పిన మాటే విన్నాడు. ఈ ఉద్యోగాలు మనకు రావు… వైసీపీ వాళ్లకే వస్తాయని చెప్పాడు. అందుకే నేను పరీక్ష రాయలేదు. ఇప్పుడు చూస్తే ఊళ్లోనే చాలా మంది టీడీపీ వాళ్లకు ఉద్యోగాలొచ్చాయి. నేను , మా అమ్మ బాగా ఏడ్చాం” అంటూ సదరు యువతి కన్నీటి పర్యంతమైంది.

First Published:  2 Oct 2019 1:31 AM GMT
Next Story