Telugu Global
NEWS

చర్చలు విఫలం: తెలంగాణలో ఈనెల 5 నుంచి ఆర్టీసీ సమ్మె

తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చర్చలు విఫలమయ్యాయి. కార్మికులు లేవనెత్తిన 26 డిమాండ్లను కమిటీ ముందు ఉంచగా.. వాటిపై సమయం కావాలని కోరారు ప్రభుత్వ అధికారులు.. జేఏసీ నేతలు కాస్త ఓపిక పట్టాలని కోరడంతో ఒప్పుకోని కార్మిక నేతలు ఈనెల 5నుంచి సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలని డిమాండ్ మొదలు పెట్టారు. ఇందుకోసం ఈనెల […]

చర్చలు విఫలం: తెలంగాణలో ఈనెల 5 నుంచి ఆర్టీసీ సమ్మె
X

తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చర్చలు విఫలమయ్యాయి. కార్మికులు లేవనెత్తిన 26 డిమాండ్లను కమిటీ ముందు ఉంచగా.. వాటిపై సమయం కావాలని కోరారు ప్రభుత్వ అధికారులు.. జేఏసీ నేతలు కాస్త ఓపిక పట్టాలని కోరడంతో ఒప్పుకోని కార్మిక నేతలు ఈనెల 5నుంచి సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలని డిమాండ్ మొదలు పెట్టారు. ఇందుకోసం ఈనెల 5 నుంచి సమ్మెకు పూనుకుంటున్నారు.

అయితే కేబినెట్ సమావేశంలో చర్చించిన కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కమిటీ వేశారు. సాధ్యాసాధ్యాలపై చర్చిస్తామన్నారు. ఇందులో భాగంగానే సీనియర్ ఐఏఎస్ లు సోమేష్ కుమార్, ఇన్ చార్జి ఎండీ సునీల్ శర్మ, మరో అధికారి తాజాగా హైదరాబాద్ లోని ఆర్టీసీ భవన్ లో కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపారు.

కార్మికుల 26 డిమాండ్లపై త్రిసభ్య కమిటీ ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంతో కార్మికులు సమ్మెకే సై అన్నారు. ఈనెల 5 నుంచి సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

త్రిసభ్య కమిటీ సభ్యులు కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మిక నాయకులు చట్టబద్ధత లేని ఈ కమిటీ హామీలకు విలువ లేదని.. తాము సమ్మెకు దిగుతున్నామని స్పష్టం చేశారు.

First Published:  2 Oct 2019 5:42 AM GMT
Next Story