హాలీవుడ్ సినిమాకి డబ్బింగ్ చెప్పిన ఐశ్వర్య….

హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నప్పుడు చాలా మంది ప్రముఖ నటీనటులు కొన్ని పాత్రలకు డబ్బింగ్ చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యనే విడుదలైన ‘లయన్ కింగ్’ సినిమాలో కూడా నాని, జగపతిబాబు, బ్రహ్మానందం, అలీ తదితరులు తెలుగు వెర్షన్ కి డబ్బింగ్ చెప్పగా, హిందీ లో షారుక్ ఖాన్, అతని కొడుకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు.

అయితే తాజాగా ఈ జాబితాలో చేరనుంది ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్. ఏంజెలీనా జోలీ నటించిన ‘మలెఫిసెంట్: మిస్ట్రెస్ ఆఫ్ ది ఈవిల్’ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా హిందీ వెర్షన్ లో ఏంజెలీనా జోలికి ఐశ్వర్యరాయ్ డబ్బింగ్ చెప్పిందట. దీనికోసం ఐశ్వర్యారాయ్ కి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ముట్టిన్నట్లు సమాచారం. రాబర్ట్ స్ట్రామ్ బర్గ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డార్క్ ఫాంటసీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిస్నీ సంస్థ ఈ సినిమాని చాలా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

2014 లో విడుదలైన ‘మలేఫిసెంట్’ అనే సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఐశ్వర్యారాయ్ డబ్బింగ్ చెప్పడంతో… ఈ సినిమా పై బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆసక్తి పెరిగింది.