సరికొత్త అవతారంలో బాలకృష్ణ

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ కొన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ గ్యాప్ లో బాలకృష్ణ బరువు కూడా పెరిగాడు.

మరోవైపు బాలకృష్ణ ‘జై సింహ’ ఫేమ్ కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 105 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ ఇప్పటికే ఈ పాత్ర కోసం 15 కేజీలు తగ్గాడట. ఇంకొక రెండు నెలలలో మరొక పది కేజీలు కూడా తగ్గనున్నాడట. బాలకృష్ణ లుక్ ఫైనలైజ్ అయిన తర్వాత డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ రోజుకి కనీసం ఐదు గంటలు జిమ్ లోనే గడుపుతున్నట్లు సమాచారం.

అంతేకాకుండా ఒక స్ట్రిక్ట్ డైట్ కూడా ఫాలో అవుతున్నాడట. ఒక స్పెషల్ ఫిట్నెస్ ట్రైనర్ ని కూడా ఎంపిక చేసిన బాలకృష్ణ…. అతని పర్యవేక్షణలోనే డైట్ మరియు వర్కౌట్స్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నాడు.