Telugu Global
National

బీజేపీలో చేరే తెలుగు రాష్ట్రాల నేతలు వీరే...

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. ఏపీపై కన్నేసిన బీజేపీ ఇక్కడి నేతలను పెద్ద ఎత్తున చేర్చుకునేందుకు స్కెచ్ గీసింది. అయితే ఎందుకోగానీ నేతల చేరిక మాత్రం సాధ్యపడలేదు. తాజాగా ఏపీ, తెలంగాణ కు చెందిన వివిధ పార్టీల నేతలు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ను కలిశారు. బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో వీరంతా బీజేపీలో చేరనున్నారు. ఏపీ నుంచి బీజేపీలో […]

బీజేపీలో చేరే తెలుగు రాష్ట్రాల నేతలు వీరే...
X

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. ఏపీపై కన్నేసిన బీజేపీ ఇక్కడి నేతలను పెద్ద ఎత్తున చేర్చుకునేందుకు స్కెచ్ గీసింది. అయితే ఎందుకోగానీ నేతల చేరిక మాత్రం సాధ్యపడలేదు.

తాజాగా ఏపీ, తెలంగాణ కు చెందిన వివిధ పార్టీల నేతలు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ను కలిశారు. బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో వీరంతా బీజేపీలో చేరనున్నారు.

ఏపీ నుంచి బీజేపీలో చేరడానికి రెడీ అయిన వారిలో వాకాటి నారాయణరెడ్డి , నక్క బాలయోగి, తోట నగేష్, సత్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, పూతలపట్టు రవి ఉన్నారు. ఇక తెలంగాణ టిడిపి నేత దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి చాలా మంది ప్రముఖ సీనియర్ నాయకులు బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి వచ్చారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో వీరంతా బిజెపిలో చేరుతారని తెలిపారు.

బీజేపీలో చేరడానికి సిద్ధమైన వారిలో శనక్కాయల అరుణ గతంలో ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. శ్రీ వి నారాయణ రెడ్డి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. రిటైర్డ్ ఇన్ కమ్ టాక్స్ కమిషనర్ జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన పార్థసారథి కూడా ఉన్నారు.

ఇక తెలంగాణ నుంచి బీజేపీలో చేరడానికి టీడీపీ సీనియర్ నేత దేవెందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా ఉన్నారు.

First Published:  3 Oct 2019 2:00 AM GMT
Next Story