Telugu Global
International

నిజాం నిధులు ఇండియాకే... జరిగింది ఇది...

నిజాం నిధుల విషయంలో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లండన్‌ కోర్టులో భారత్ విజయం సాధించింది. నిజాం నిధులు భారత్‌కే చెందుతాయని లండన్‌ కోర్టు 140 పేజీల తీర్పును వెలువరించింది. హైదరాబాద్ ఆఖరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ లండన్‌లోని ఒక బ్యాంకులో డిపాజిట్ చేసిన నిధులు భారత్‌కే దక్కుతాయని తేల్చింది. ఈ నిధుల కోసం పాకిస్థాన్‌- భారత్‌ మధ్య ఏడు దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. హైదరాబాద్ సంస్థానంపై ఆపరేషన్‌ పోలోకు కొద్దిరోజుల ముందు మీర్ […]

నిజాం నిధులు ఇండియాకే... జరిగింది ఇది...
X

నిజాం నిధుల విషయంలో పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లండన్‌ కోర్టులో భారత్ విజయం సాధించింది. నిజాం నిధులు భారత్‌కే చెందుతాయని లండన్‌ కోర్టు 140 పేజీల తీర్పును వెలువరించింది. హైదరాబాద్ ఆఖరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ లండన్‌లోని ఒక బ్యాంకులో డిపాజిట్ చేసిన నిధులు భారత్‌కే దక్కుతాయని తేల్చింది.

ఈ నిధుల కోసం పాకిస్థాన్‌- భారత్‌ మధ్య ఏడు దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. హైదరాబాద్ సంస్థానంపై ఆపరేషన్‌ పోలోకు కొద్దిరోజుల ముందు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 10 లక్షల 7వేల 940 పౌండ్లను లండన్‌లోని పాక్‌ హైకమిషనర్‌ ఖాతాలోకి బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆ నిధులు లండన్‌లోని బ్యాంకులోనే ఉన్నాయి. ఆ నిధులను తిరిగి ఇవ్వాలని నవాబు, ఆయన వారసులు కోరినా పాకిస్థాన్‌ అంగీకరించలేదు. భారత్‌ కూడా రంగంలోకి దిగింది. నవాబు వారసులు, భారత్ ప్రభుత్వం సంయుక్తంగా న్యాయస్థానంలో పాకిస్తాన్‌ను ఎదుర్కొన్నాయి.

హైదరాబాద్ సంస్థాన విలీనం చట్టబద్దంగా జరగలేదని… కాబట్టి నవాబు నిధులు భారత్‌కు గానీ, ఆయన వారుసులకు గానీ చెందబోవని పాకిస్థాన్‌ వాదించింది.

తమ దేశ హైకమిషనర్ పేరిట జమ అయిన సొత్తును ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించింది. అప్పట్లో ఆ నిధులను పాకిస్తాన్‌ సరఫరా చేసే ఆయుధాల కోసమే నవాబు జమ చేశారని పాక్‌ వాదించింది.

అయితే ఆయుధాల సరఫరా కోసమే ఆ నిధులను బదిలీ చేశారని నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాలను పాకిస్తాన్‌ చూపలేకపోయింది. ఆ డబ్బు భారత్ చేతికి చిక్కకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే నవాబు పాకిస్థాన్‌ హైకమిషనర్‌ ఖాతాలోకి మళ్లించారన్న వాదనతోనూ కోర్టు ఏకీభవించలేదు.

పాక్ వాదనను భారత్ తిప్పికొట్టింది. భారత్‌లో సంస్థానం విలీనానికి, ఈ నిధులకు ఎలాంటి సంబంధం లేదని వాదించింది. కోర్టు భారత్ వాదనతోనే ఏకీభవించింది. అలీ ఖాన్ 10 లక్షల 7వేల 940 పౌండ్లను అప్పట్లో బదిలీ చేయగా అది బ్యాంకులోనే ఉండిపోవడంతో ఇప్పుడు వడ్డీతో కలిపి భారత కరెన్సీలో 306.50 కోట్లకు చేరింది.

నిజాం నిధులు భారత్‌కే చెందుతాయని… అయితే ఆ నిధులను భారత ప్రభుత్వం తీసుకుంటుందా.. లేక నిజాం వారసులు తీసుకుంటారా అన్నది వారిద్దరే తేల్చుకోవాల్సి ఉంటుందని లండన్ కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై నిజాం వారసులు హర్షం వ్యక్తం చేశారు. ఉస్మాన్ అలీఖాన్ చేత 8వ నవాబుగా ప్రకటించబడ్డ ముకర్రం జా కుటుంబం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటోంది.

First Published:  2 Oct 2019 8:22 PM GMT
Next Story