Telugu Global
Cinema & Entertainment

వెబ్ సిరీస్ తో అదృష్టం పరీక్షించుకొనున్న మెహరీన్

పంజాబీ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా కి పేరుకి బోలెడు ఆఫర్లు వస్తున్నాయి…. కానీ ఒక్క సినిమాతో కూడా తన పర్ఫార్మెన్స్ తో మంచి మార్కులు వేయించుకో లేకపోతుంది. ఈమధ్యనే ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెహరీన్ ఇప్పుడు గోపీచంద్ హీరోగా నటిస్తున్న ‘చాణక్య’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ‘పంతం’ సినిమా తర్వాత గోపీచంద్ మరియు మెహరీన్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది. తమిళ దర్శకుడు […]

వెబ్ సిరీస్ తో అదృష్టం పరీక్షించుకొనున్న మెహరీన్
X

పంజాబీ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా కి పేరుకి బోలెడు ఆఫర్లు వస్తున్నాయి…. కానీ ఒక్క సినిమాతో కూడా తన పర్ఫార్మెన్స్ తో మంచి మార్కులు వేయించుకో లేకపోతుంది.

ఈమధ్యనే ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెహరీన్ ఇప్పుడు గోపీచంద్ హీరోగా నటిస్తున్న ‘చాణక్య’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

‘పంతం’ సినిమా తర్వాత గోపీచంద్ మరియు మెహరీన్ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది. తమిళ దర్శకుడు తిరు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మధ్యనే ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా అక్టోబర్ 5 న విడుదలకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం సమంత, మంచు లక్ష్మి లాగా మెహ్రీన్ పిర్జాదా కూడా డిజిటల్ మీడియాలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

మెహరీన్ వెబ్ సిరీస్ లో నటించాలని అనుకుంటుందట. ఈ నేపథ్యంలో కొన్ని కథలు కూడా వింటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏదో ఒక వెబ్ సిరీస్ లో కనిపించనుంది మెహరీన్. ‘చాణక్య’ సినిమా కాకుండా మెహ్రీన్ పిర్జాదా కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించనుంది.

First Published:  2 Oct 2019 9:14 PM GMT
Next Story