6వ ర్యాంక్ కు పడిన పీవీ సింధు

  • 25వ ర్యాంకులో పారుపల్లి కశ్యప్

ప్రపంచ చాంపియన్ పీవీ సింధు…ప్రపంచ ర్యాంకింగ్స్ లో ఆరోస్థానికి పడిపోయింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పురుషుల సింగిల్స్ లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ 25వ ర్యాంక్ కు చేరుకోగలిగాడు.

మహిళల సింగిల్స్ లో గత రెండువారాలుగా దారుణంగా విఫలమైన సింధు…5వ ర్యాంక్ నుంచి 6వ ర్యాంక్ కు పడిపోయింది.

5 మాసాల క్రితం ప్రపంచ రెండో ర్యాంకర్ గా ఉన్న సింధు… త్వరలో జరిగే డేనిష్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలలో రాణించడం ద్వారా తన ర్యాంక్ ను మెరుగుపరచుకోవాలన్న లక్ష్యంతో ఉంది. 

పుంజుకొన్న కశ్యప్…

కొరియా ఓపెన్ సెమీస్ చేరడం ద్వారా కశ్యప్ 25వ ర్యాంక్ కు చేరగలిగాడు. కిడాంబీ శ్రీకాంత్ 9, సాయి ప్రణీత్ 12, సమీర్ వర్మ 17 ర్యాంకుల్లో నిలిచారు. మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ తన 8వ ర్యాంక్ ను నిలుపుకోగలిగింది.