Telugu Global
NEWS

రోహిత్ శర్మ త్రీ-ఇన్-వన్ రికార్డు

మూడుఫార్మాట్లలోనూ ఓపెనర్ గా సెంచరీలు క్రికెట్ చరిత్రలో 7వ ఆటగాడిగా రోహిత్ భారత డాషింగ్ ఓపెనర్ రోహి్త శర్మ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్టులో ఓపెనర్ అవతారమెత్తిన రోహిత్ శతకం సాధించడం ద్వారా…ఓ అసాధారణ రికార్డు సాధించాడు. మరో ఆరుగురు మొనగాళ్ల సరసన నిలిచాడు. ధూమ్ ధామ్ టీ-20, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లలో ఓపెనర్ గా శతకాలు బాదిన భారత తొలి క్రికెటర్ […]

రోహిత్ శర్మ త్రీ-ఇన్-వన్ రికార్డు
X
  • మూడుఫార్మాట్లలోనూ ఓపెనర్ గా సెంచరీలు
  • క్రికెట్ చరిత్రలో 7వ ఆటగాడిగా రోహిత్

భారత డాషింగ్ ఓపెనర్ రోహి్త శర్మ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్టులో ఓపెనర్ అవతారమెత్తిన రోహిత్ శతకం సాధించడం ద్వారా…ఓ అసాధారణ రికార్డు సాధించాడు. మరో ఆరుగురు మొనగాళ్ల సరసన నిలిచాడు.

ధూమ్ ధామ్ టీ-20, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లలో ఓపెనర్ గా శతకాలు బాదిన భారత తొలి క్రికెటర్ గా, క్రికెట్ చరిత్రలో 7వ ప్లేయర్ గా రికార్డు సాధించాడు.

వర్షంతో నిలిచిపోయిన…విశాఖ టెస్ట్ తొలిరోజు ఆటలో ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన రోహిత్ 12 బౌండ్రీలు, 5 సిక్సర్లతో అజేయశతకం సాధించడం ద్వారా భారత్ భారీ స్కోరుకు పునాది వేశాడు. సహ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తో కలసి మొదటి వికెట్ కు 202 పరుగుల డబుల్ సెంచరీ భాగస్వామ్యం అందించాడు.

7వ క్రికెటర్ రోహిత్…

ఆధునిక క్రికెట్ చరిత్రలోని మూడు ఫార్మాట్లలో ఓపెనర్ గా సెంచరీలు బాదిన క్రికెటర్లలో…క్రిస్ గేల్, బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గప్టిల్, తిలకరత్నే దిల్షాన్, అహ్మద్ షెజాదే, షేన్ వాట్సన్, తమీమ్ ఇక్బాల్, రోహిత్ శర్మ ఉన్నారు.

First Published:  2 Oct 2019 8:48 PM GMT
Next Story