Telugu Global
NEWS

సుమో వస్తాదులతో జోకోవిచ్ సరదాసరదా కుస్తీ

టోక్యో ఓపెన్ కు ముందు జోకర్ సందడే సందడి బాబోయ్…సుమో వస్తాదులు అంటున్న ప్రపంచ నంబర్ వన్ ప్రపంచ టెన్నిస్ సూపర్ స్టార్, టాప్ ర్యాంక్ ప్లేయర్ నొవాక్ జోకోవిచ్…జపాన్ ఓపెన్లో పాల్గొనటానికి ముందు టోక్యోలో సందడి సందడి చేశాడు. టెన్నిస్ వర్గాలలో జోకర్ గా పేరుపొందిన జోకోవిచ్ లో హాస్యప్రియత్వం చాలా ఎక్కువని మరోసారి చాటుకొన్నాడు. టోక్యో ఓపెన్ లో పాల్గొనటానికి ముందు లభించిన విరామం సమయంలో…తనకు ఎంతో ఇష్టమైన సుమో వస్తాదులను కలుసుకొన్నాడు. టోక్యో నగరంలోని […]

సుమో వస్తాదులతో జోకోవిచ్ సరదాసరదా కుస్తీ
X
  • టోక్యో ఓపెన్ కు ముందు జోకర్ సందడే సందడి
  • బాబోయ్…సుమో వస్తాదులు అంటున్న ప్రపంచ నంబర్ వన్

ప్రపంచ టెన్నిస్ సూపర్ స్టార్, టాప్ ర్యాంక్ ప్లేయర్ నొవాక్ జోకోవిచ్…జపాన్ ఓపెన్లో పాల్గొనటానికి ముందు టోక్యోలో సందడి సందడి చేశాడు. టెన్నిస్ వర్గాలలో జోకర్ గా పేరుపొందిన జోకోవిచ్ లో హాస్యప్రియత్వం చాలా ఎక్కువని మరోసారి చాటుకొన్నాడు.

టోక్యో ఓపెన్ లో పాల్గొనటానికి ముందు లభించిన విరామం సమయంలో…తనకు ఎంతో ఇష్టమైన సుమో వస్తాదులను కలుసుకొన్నాడు.

టోక్యో నగరంలోని సుమో వస్తాదులు సాధన చేసే కేంద్రానికి వెళ్లిన జోకో కొద్ది సమయం వారితో గడిపాడు.

బాల్యం నుంచి సుమో కుస్తీ ఇష్టం…

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో 16 టైటిల్స్ విజేత, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ జోకోవిచ్ కు బాల్యం నుంచి సుమో కుస్తీ అంటే ఎంతో మక్కువ.

తండ్రి, సోదరుడుతో కలసి సుమో కుస్తీ పోటీలను టీవీ ప్రసారాల ద్వారా ఎక్కడలేని ఇష్టంతో వీక్షించేవాడు.

ప్రస్తుత జపాన్ ఓపెన్ ద్వారా…నేరుగా సుమో వస్తాదులనే కలసుకొనే అవకాశం చేజిక్కించుకొన్నాడు.

తన కంటే బరువులో మూడురెట్లు ఎక్కువగా ఉన్న సుమో వస్తాదుల రోజువారీ సన్నాహాలు, సాధనను దగ్గరుండి గమనించాడు. సుమో వస్తాదుల ప్రాక్టీస్ కుస్తీకి రిఫరీగా వ్యవహరించడమేకాదు…వారితో కుస్తీ పట్టే సాహసం సైతం చేశాడు.

బరిలోనుంచి సుమో వస్తాదును బయటకు నెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. సుమో వస్తాదులు ప్రాక్టీస్, వ్యాయామం చాలా కష్టమైనవి, క్లిష్టమైనవని జోకోవిచ్ వ్యాఖ్యానించాడు.

సుమో వస్తాదులు రోజుకు 10వేల క్యాలరీల మేర ఆహారం తీసుకొంటారని…చిన్నసైజు పర్వతాల మాదిరిగా ఉంటారని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు.

కుస్తీ పోటీని సుమో వస్తాదులు మాత్రమే కాదు…జపాన్ ప్రజలు సైతం ఎంతో పవిత్రంగా చూడటం, భావించడాన్ని చూసి జోకోవిచ్ అబ్బురపడ్డాడు.

2వేల సంవత్సరాల చరిత్ర, సాంప్రదాయం సుమో కుస్తీకి ఉన్నాయని జోకోవిచ్ గుర్తు చేశాడు.

First Published:  2 Oct 2019 7:02 PM GMT
Next Story