Telugu Global
Cinema & Entertainment

సెప్టెంబర్ బాక్సాఫీస్ రివ్యూ

సెప్టెంబర్ లో 19 స్ట్రయిట్ సినిమాలు రిలీజయ్యాయి. మరో 7 డబ్బింగ్ సినిమాలొచ్చాయి. ఈ 26 సినిమాల్లో కమర్షియల్ గా హిట్ అయింది కేవలం ఒక్కటంటే ఒక్క సినిమా మాత్రమే. అదే గద్దలకొండ గణేష్. సెప్టెంబర్ టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ చూద్దాం. సెప్టెంబర్ మొదటి వారంలో… జోడి, ఉండిపోరాదే, దర్పణం, 2 అవర్స్ లవ్, నీకోసం, వీడే సరైనోడు, తారామణి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకోలేకపోయింది. జోడీపై ఓ మోస్తరు అంచనాలున్నప్పటికీ […]

సెప్టెంబర్ బాక్సాఫీస్ రివ్యూ
X

సెప్టెంబర్ లో 19 స్ట్రయిట్ సినిమాలు రిలీజయ్యాయి. మరో 7 డబ్బింగ్ సినిమాలొచ్చాయి. ఈ 26 సినిమాల్లో కమర్షియల్ గా హిట్ అయింది కేవలం ఒక్కటంటే ఒక్క సినిమా మాత్రమే. అదే గద్దలకొండ గణేష్. సెప్టెంబర్ టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ చూద్దాం.

సెప్టెంబర్ మొదటి వారంలో… జోడి, ఉండిపోరాదే, దర్పణం, 2 అవర్స్ లవ్, నీకోసం, వీడే సరైనోడు, తారామణి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకోలేకపోయింది. జోడీపై ఓ మోస్తరు అంచనాలున్నప్పటికీ ఆది సాయికుమార్ మరోసారి నిరాశపరిచాడు. వరుసగా ఫ్లాపులిస్తున్న ఈ హీరో, బుర్రకథ తర్వాత జోడీతో మళ్లీ ఫ్లాప్ అందుకున్నాడు. ఇక మిగతా సినిమాల సంగతి సరే సరి.

ఇక సెప్టెంబర్ రెండో వారంలో… పహిల్వాన్, మార్షన్, గ్యాంగ్ లీడర్ సినిమాలొచ్చాయి. సెప్టెంబర్ బాక్సాఫీస్ కు గ్యాంగ్ లీడర్ మంచి ఓపెనింగ్ అయితే ఇచ్చాడు కానీ లాభాలు మాత్రం ఇవ్వలేకపోయాడు. అవును.. గ్యాంగ్ లీడర్ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. సినిమాను తక్కువ రేట్లకే అమ్మినప్పటికీ బ్రేక్ ఈవెన్ అవ్వలేకపోయాడు గ్యాంగ్ లీడర్. అలా నాని-విక్రమ్ కుమార్ కాంబినేషన్ ఫెయిల్ అయింది. ఈ సినిమాతో పాటు వచ్చిన పహిల్వాన్, మార్షల్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. కాకపోతే హైప్ తో వచ్చి గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ అయితే, ఎలాంటి హైప్ లేకుండా వచ్చి ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

సెప్టెంబర్ మూడో వారంలో… 4 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో గద్దలకొండ గణేష్ మాత్రమే హిట్ అయింది. వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్లలో బ్రేక్ ఈవెన్ అయింది. గద్దలకొండ గణేష్ తో పాటు వచ్చిన బందోబస్త్, నేను నా నాగార్జున, పండుగాడి ఫొటో స్టుడియో సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. సూర్య నటించిన బందోబస్త్ సినిమా అయితే డబుల్ డిజాస్టర్ అయింది.

నాలుగో వారంలో…. రాయలసీమ లవ్ స్టోరీ, నిన్ను తలచి, రామ సక్కని సీత, మిర్రర్, బడుగు జీవులు (బీజే) లాంటి సినిమాలన్నీ వచ్చాయి. ఇవన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. ఇలా సెప్టెంబర్ నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తే.. వాటిలో వరుణ్ తేజ్ సినిమా ఒక్కటే డబ్బులు రాబట్టగలిగింది. మిగతావన్నీ ఫ్లాపులుగానే మిగిలాయి.

First Published:  2 Oct 2019 9:10 PM GMT
Next Story