Telugu Global
NEWS

పరుగుల వానతో నిలిచిన విశాఖ టెస్ట్

తొలిరోజు ఆటలో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ భారత ఓపెనర్ల అజేయ డబుల్ సెంచరీ భాగస్వామ్యం ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా…విశాఖలోని ఏసీఏ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన తొలిటెస్ట్ తొలిరోజు ఆటలో భారత ఓపెనింగ్ జోడీ మయాంక్ అగర్వాల్- రోహిత్ శర్మ మొదటి వికెట్ కు 202 పరుగుల అజేయభాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. టీ-విరామానికి ముందు కుండపోత వర్షంతో ఆట నిలిపివేసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 59.1 ఓవర్లలో 202 […]

పరుగుల వానతో నిలిచిన విశాఖ టెస్ట్
X
  • తొలిరోజు ఆటలో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ
  • భారత ఓపెనర్ల అజేయ డబుల్ సెంచరీ భాగస్వామ్యం

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా…విశాఖలోని ఏసీఏ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన తొలిటెస్ట్ తొలిరోజు ఆటలో భారత ఓపెనింగ్ జోడీ మయాంక్ అగర్వాల్- రోహిత్ శర్మ మొదటి వికెట్ కు 202 పరుగుల అజేయభాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

టీ-విరామానికి ముందు కుండపోత వర్షంతో ఆట నిలిపివేసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 59.1 ఓవర్లలో 202 పరుగుల స్కోరు సాధించింది.

రోహిత్ శర్మ 115, మయాంక్ అగర్వాల్ 84 పరుగుల స్కోర్లతో నాటౌట్ గా ఉన్నారు.

టీ విరామం తర్వాత సైతం వానపడటంతో ఆఖరి రెండుగంటల ఆటను రద్దు చేసినట్లు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్స్ సన్ ప్రకటించారు.

రోహిత్ నాలుగో టెస్ట్ శతకం..

ఇప్పటి వరకూ వన్డే, టీ-20 ఫార్మాట్లలో పరుగుల మోత మోగించిన డాషింగ్ ఓపెనర్ …తన కెరియర్ లో తొలిసారిగా టెస్‌ క్రికెట్లో సైతం ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగి సత్తా చాటుకొన్నాడు.

మయాంక్ అగర్వాల్ తో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్… ఆత్మవిశ్వాసంతో సఫారీ బౌలర్లను ఎదుర్కొని పరుగుల వర్షం కురిపించాడు. 154 బాల్స్ లో 10 బౌండ్రీలు, 4 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసిన రోహిత్…మొత్తం 174 బాల్స్ లో 12 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 115 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.

తన కెరియర్ లో 28వ టెస్ట్ మాత్రమే ఆడుతున్న రోహిత్ కు ఇది నాలుగో శతకం కావడం విశేషం.

First Published:  2 Oct 2019 8:23 PM GMT
Next Story