5న ఢిల్లీకి సీఎం జగన్‌… మోడీకి ఆహ్వానం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 5న ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానితో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈనెల 15న రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తోంది.

ఆ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రధానిని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి భేటీలో ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న పలు అంశాలను ప్రధాని దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్తారని సీఎంవో వెల్లడించింది.