Telugu Global
Cinema & Entertainment

మరో హీరోయిన్ పెళ్లికి రెడీ

హీరోయిన్లు కెరీర్ లో చివరి వరకు ప్రయత్నిస్తుంటారు. ఇక బండి లాగించడం కష్టం అనుకున్న టైమ్ లో మాత్రమే పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు హీరోయిన్ అర్చన కూడా అదే పని చేసింది. కెరీర్ చరమాంకానికి చేరుకున్న వేళ, జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంది. కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న జగదీష్ తో నిశ్చితార్థం చేసుకుంది. నిన్న రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ హోటల్ లో అర్చన-జగదీష్ ల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. అర్చన […]

మరో హీరోయిన్ పెళ్లికి రెడీ
X

హీరోయిన్లు కెరీర్ లో చివరి వరకు ప్రయత్నిస్తుంటారు. ఇక బండి లాగించడం కష్టం అనుకున్న టైమ్ లో మాత్రమే పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు హీరోయిన్ అర్చన కూడా అదే పని చేసింది. కెరీర్ చరమాంకానికి చేరుకున్న వేళ, జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంది. కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న జగదీష్ తో నిశ్చితార్థం చేసుకుంది.

నిన్న రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ హోటల్ లో అర్చన-జగదీష్ ల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. అర్చన ఫ్రెండ్స్ తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ నిశ్చితార్థానికి వచ్చారు. త్వరలోనే పెళ్లి తేదీని వెల్లడిస్తారు. ఓ పెద్ద హెల్త్-కేర్ కంపెనీలో వైస్-ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు జగదీష్.

వేదగా ఇండస్ట్రీకి పరిచయమైంది అర్చన. అదే పేరుతో దాదాపు 10 సినిమాలు చేసింది. కానీ ఆ పేరు ఆమెకు అచ్చిరాలేదు. దాంతో సొంత పేరునే వాడుకలోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ ఆమె కెరీర్ ఊపందుకోలేదు. ఒక దశలో క్రేజ్ కోసం బిగ్ బాస్ షోలో కూడా ఆమె నటించింది. అది కూడా సత్ఫలితాల్నివ్వలేదు. చివరికి తమిళ, కన్నడ భాషల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. అది కూడా కలిసిరాలేదు.

రీసెంట్ గా వచ్చిన వజ్రకవచధర గోవింద సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించింది అర్చన. ప్రస్తుతానికి అదే ఆమె నటించిన చివరి సినిమా. పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతుందా లేక ఇంటికే పరిమితమౌతుందా అనేది ఇంకా క్లారిటీ లేదు.

First Published:  4 Oct 2019 5:38 AM GMT
Next Story