ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్ట్ శ్రీనాథ్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

శ్రీనాథ్‌ రెడ్డి 28 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. పలు తెలుగు, ఆంగ్ల పత్రికల్లో పనిచేశారు.

2014 నుంచి కొంత కాలం పాటు ఒక మీడియా సంస్థలో పొలిటికల్ సెల్‌ అడ్వయిజర్‌గా పనిచేశారు. శ్రీనాథ్‌ రెడ్డి సొంతూరు పులివెందుల నియోజకవర్గంలోని కోరగుంటపల్లె.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీయూడబ్ల్యూజేలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు.