అంజలి పై కేసు నమోదు

తెలుగమ్మాయి అయిన అంజలి తమిళ సినిమా పరిశ్రమ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు లో మాత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తో అందరి దృష్టి ని ఆకర్షించింది.

అయితే తెలుగులో అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు అంజలి కి. తెలుగులో కన్నా తమిళం లో నే అంజలికి మంచి మార్కెట్ ఉంది.

ఇకపోతే… అంజలి పైన చర్యలు తీసుకోవాలని కోవై సుడర్‌పార్వై మక్కళ్‌ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ గురువారం ఆహార భద్రత శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే నిబంధనలకు విరుద్ధం గా వ్యాపారం సాగిస్తున్న ఒక వంట నూనె కంపెనీకి అంజలి ప్రచారం చేస్తున్నారంటూ ఆమెపై ఫిర్యాదు చేశారు సత్య గాంధీ. ఆ వంట నూనె వాడకం వలన చాలా మందికి హాని జరుగుతోందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అందుకే ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అంజలి కూడా ఈ హాని జరిగే ప్రక్రియ లో పాలుపంచుకుంటున్నందున ఆమె పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె పై కూడా కేసు నమోదు చేసారు పోలీసులు.