లైవ్‌లో పచ్చిబూతులు మాట్లాడిన చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశారు. మగాళ్లు లేని వేళల్లో గ్రామ వాలంటీర్లు వచ్చి తలుపు తట్టడం ఏమిటి అని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు…. అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. అయినా చంద్రబాబు తన తీరును సమీక్షించుకోలేదు.

గురువారం ప్రత్యర్థి పార్టీకి చెందిన నెటిజన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు… వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారో చూడండి అంటూ తెర మీద ప్రదర్శించారు. నెటిజన్లు చేసిన కామెంట్లను స్వయంగా చదివి వినిపించారు.

పార్టీలతో సంబంధం లేకుండా కొందరు వ్యక్తులు నీచంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్న మాట అయితే వాస్తవమే. ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలను, మహిళా నేతలను టార్గెట్‌ చేసుకుని పచ్చి బూతులు, అసభ్యకర పదజాలంలో పోస్టులు పెడుతున్నది నిజమే. అలా చేయడం ద్వారా వారివారి పార్టీ సర్కిల్స్‌లో గుర్తింపు తెచ్చుకునేందుకు ఇదో మార్గంగా పార్టీల నెటిజన్లకు మారిందన్న విమర్శ ఉంది. ఇలా బూతు పోస్టులు పెట్టేవారిలో అన్ని పార్టీల వారూ ఉన్నారు.

ఈ బూతు పోస్టులకు టీడీపీ, వైసీపీ, జనసేన ఏదీ కూడా మినహాయింపు కాదు. కొందరు ఆడవాళ్లు కూడా ఇలాంటి దిగజారుడు పోస్టులు పెట్టడం జరుగుతోంది. అయితే ఇలా పోస్టులు పెట్టాల్సిందిగా ఏ పార్టీ నాయకత్వం కూడా స్వయంగా దిశానిర్దేశం చేయడం ఉండదు. కొందరు విచక్షణ లేని నెటిజన్లే ఇలాంటి బూతు పోస్టులు పెట్టి సంబరపడుతుంటారు. అది వారి స్థాయి.

మరి 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు సీఎంగా ఉన్న నచంద్రబాబు కూడా అదే పనిచేయవచ్చా?. కానీ చేశారు. వైసీపీ నెటిజన్లు కొందరు పెట్టిన బూతు పోస్టులను లైవ్‌లో చదివారు చంద్రబాబు. ఆ సమయంలోనే చంద్రబాబు ”ల***”, దెం***” వంటి పదాలను వల్లె వేశారు. తాను కావాలనే ఈ బూతు మాటలు మాట్లాడుతున్నాను అని కూడా ఆయన స్వయంగా చెప్పారు.

అప్పటి వరకు 40 ఏళ్ల అనుభవం ఏదో సమాజానికి మంచి మేసేజ్ ఇస్తుందని టీవీలు చూస్తున్న వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. చంద్రబాబు ల** పదాలు, దె** పదాలు ఉచ్చరించడంతో జనం చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి. అతడెవడో పనికి మాలిన వాడు ఇలాంటి పదాలతో పోస్టులు పెట్టారంటే అర్థముంది… కానీ అలాంటి వ్యక్తులు పెట్టిన పోస్టులను, బూతులను సమాజానికి పరిచయం చేసేందుకు తిరిగి మాజీ ముఖ్యమంత్రి ప్రయత్నించడం దిగ్బ్రాంతికి గురి చేసింది.

ఈ లెక్కన బూతు పోస్టులు పెట్టే నెటిజన్లు…. చంద్రబాబు స్థాయికి ఎదిగారా?. లేక చంద్రబాబే బూతు పోస్టులు పెట్టే నెటిజన్ల స్థాయికి వచ్చారా ? అని బాబుపై ట్రోలింగ్ మొదలైంది.