Telugu Global
NEWS

భారత హాకీజట్టు టాప్ గేర్

బెల్జియం టూర్ లో తిరుగులేని భారత్  ఐదుకు ఐదుమ్యాచ్ లూ నెగ్గిన భారత్ ప్రపంచ మాజీ చాంపియన్ భారత్…టోక్యో ఒలింపిక్స్ బెర్త్ కోసం ఉరకలేస్తోంది. ఒలింపిక్స్ అర్హత పోటీల కోసం సన్నాహాలను జోరుగా మొదలు పెట్టింది. బెల్జియం టూర్ లో భాగంగా ప్రపంచ, యూరోపియన్ చాంపియన్ బెల్జియం, స్పెయిన్ జట్లతో ఆడిన ఐదుకు ఐదుమ్యాచ్ ల్లోనూ తిరుగులేని విజయాలతో అజేయంగా నిలిచింది. యాంట్వార్ప్ వేదికగా విశ్వవిజేత బెల్జియంతో జరిగిన ఆఖరి మ్యాచ్ లో….భారత్ 5-1గోల్స్ తో భారీ విజయంతో […]

భారత హాకీజట్టు టాప్ గేర్
X
  • బెల్జియం టూర్ లో తిరుగులేని భారత్
  • ఐదుకు ఐదుమ్యాచ్ లూ నెగ్గిన భారత్

ప్రపంచ మాజీ చాంపియన్ భారత్…టోక్యో ఒలింపిక్స్ బెర్త్ కోసం ఉరకలేస్తోంది. ఒలింపిక్స్ అర్హత పోటీల కోసం సన్నాహాలను జోరుగా మొదలు పెట్టింది.

బెల్జియం టూర్ లో భాగంగా ప్రపంచ, యూరోపియన్ చాంపియన్ బెల్జియం, స్పెయిన్ జట్లతో ఆడిన ఐదుకు ఐదుమ్యాచ్ ల్లోనూ తిరుగులేని విజయాలతో అజేయంగా నిలిచింది.

యాంట్వార్ప్ వేదికగా విశ్వవిజేత బెల్జియంతో జరిగిన ఆఖరి మ్యాచ్ లో….భారత్ 5-1గోల్స్ తో భారీ విజయంతో టూర్ ను విజయవంతంగా ముగించింది.

బెల్జియం టూర్ ప్రారంభమ్యాచ్ లో 2-0గోల్స్ తో నెగ్గిన 5వ ర్యాంకర్ భారత్…ఆ తర్వాత స్పెయిన్ ఆడిన రెండు, మూడు మ్యాచ్ ల్లో 6-1, 5-1 గోల్స్ విజయాలు నమోదు చేసింది.

టూర్ లోని నాలుగో మ్యాచ్ లో బెల్జియంను 2-1 తో అధిగమించిన భారత్ ఆఖరి మ్యాచ్ లో తన ఆటతీరును టాప్ గేర్ కు తీసుకువెళ్ళింది.

ఏకపక్షంగా సాగిన ఈ పోరులో …ఆట మొదటి భాగం 7వ నిముషంలో సిమ్రాన్ జీత్ సింగ్ తొలిగోలు అందించాడు.

ఆట 35వ నిముషంలో లలిత్ కుమార్ భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.

ఆట 36వ నిముషంలో వివేక్ సాగర్ ప్రసాద్ మూడో గోలు, 42వ నిముషంలో హర్మన్ ప్రీత్ సింగ్ నాలుగో గోలు సాధించారు.

ఆట 43వ నిముషంలో రమణ్ దీప్ సింగ్ సాధించిన గోలుతో భారత్ 5-1గోల్స్ తో విజయాన్ని, బెల్జియం టూర్ ను ముగించగలిగింది.

First Published:  3 Oct 2019 8:32 PM GMT
Next Story