Telugu Global
CRIME

మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ.... విచారణకు ఆదేశం...

తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంతటి బలమైన నాయకుడు, ప్రభుత్వాధినేత మంత్రి కేటీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేయడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓ ఉన్నతస్థాయి పోస్టుకోసం ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసిన ఈ నిర్వాకం బట్టబయలు అయ్యింది. నల్గొండ జిల్లా రావులపెంట ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు హెచ్ఎం శ్రీమతి మంగళ జిల్లా కోర్డినేటర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఎంత ప్రయత్నించినా ఆ పోస్టు దక్కకపోవడంతో అడ్డదారులు తొక్కారు. ఏకంగా మంత్రి కేటీఆర్ సంతకాన్ని […]

మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ.... విచారణకు ఆదేశం...
X

తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంతటి బలమైన నాయకుడు, ప్రభుత్వాధినేత మంత్రి కేటీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేయడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓ ఉన్నతస్థాయి పోస్టుకోసం ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసిన ఈ నిర్వాకం బట్టబయలు అయ్యింది.

నల్గొండ జిల్లా రావులపెంట ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు హెచ్ఎం శ్రీమతి మంగళ జిల్లా కోర్డినేటర్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఎంత ప్రయత్నించినా ఆ పోస్టు దక్కకపోవడంతో అడ్డదారులు తొక్కారు. ఏకంగా మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక రికమండేషన్ లెటర్ ను సైతం సృష్టించారు.

మంత్రి కేటీఆర్ రికమండేషన్ లెటర్ తో జిల్లా కోఆర్డినేటర్ పదవి కోసం ప్రయత్నించారు. అయితే ఉన్నతాధికారులు ఆమె కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. మంత్రి కేటీఆర్ ను సంప్రదించగా ఆయన తాను సంతకం పెట్టలేదని తెలిపారు.

దీంతో మంత్రి కేటీఆర్ సీరియస్ గా స్పందించినట్టు తెలిసింది. తన సంతకాన్నే ఫోర్జరీ చేసిన ప్రధానోపాధ్యాయురాలిపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశించారట.. కేటీఆర్ రికమండేషన్ చేయకున్నా సంతకం ఫోర్జరీ చేయడంతో ప్రధానోపాధ్యాయురాలు ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నారు.

First Published:  4 Oct 2019 1:36 AM GMT
Next Story