Telugu Global
Cinema & Entertainment

మరోసారి విదేశాలకు వెళ్ళిన మహేష్

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. సంక్రాంతికి ఈ సినిమా రాబోతోంది. షూటింగ్ కు ఇంకా చాలా తక్కువ టైమ్ మాత్రమే ఉంది. ఇలాంటి టైమ్ లో ఎవరైనా గ్యాప్ తీసుకుంటారా? మహేష్ మాత్రం తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి ఎంచక్కా మరో హాలిడే ట్రిప్ కు వెళ్లిపోయాడు. అవును.. తన కుటుంబంతో కలిసి మహేష్ దుబాయ్ వెళ్లిపోయాడు. ఈసారి దసరా సంబరాలన్నీ అక్కడే. పిల్లలకు దసరా సెలవులు రావడంతో, మహేష్ కూడా సినిమాకు […]

మరోసారి విదేశాలకు వెళ్ళిన మహేష్
X

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. సంక్రాంతికి ఈ సినిమా రాబోతోంది. షూటింగ్ కు ఇంకా చాలా తక్కువ టైమ్ మాత్రమే ఉంది. ఇలాంటి టైమ్ లో ఎవరైనా గ్యాప్ తీసుకుంటారా? మహేష్ మాత్రం తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి ఎంచక్కా మరో హాలిడే ట్రిప్ కు వెళ్లిపోయాడు.

అవును.. తన కుటుంబంతో కలిసి మహేష్ దుబాయ్ వెళ్లిపోయాడు. ఈసారి దసరా సంబరాలన్నీ అక్కడే. పిల్లలకు దసరా సెలవులు రావడంతో, మహేష్ కూడా సినిమాకు లీవ్ పెట్టేశాడు. కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిపోయాడు. అయితే సినిమాకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు మహేష్. తన పోర్షన్ కు సంబంధించి దాదాపు 50శాతం షూటింగ్ పూర్తిచేశాడు. మరోవైపు సినిమా షూటింగ్ కూడా ఆగడం లేదు.. మహేష్ తో సంబంధం లేని సన్నివేశాల్ని షూట్ చేయబోతున్నారు.

ఈనెల 14 నుంచి తిరిగి షూట్ లో జాయిన్ అవుతాడు మహేష్. ఆ తర్వాతే తమన్న-మహేష్ పై స్పెషల్ సాంగ్ షూటింగ్ ఉంటుంది. నవంబర్ చివరినాటికి టోటల్ షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఓ 2 వారాలు అటుఇటుగా షూటింగ్ నడిచినా, అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు చాలా టైమ్ ఉంటుంది. సో.. సంక్రాంతి రిలీజ్ కు ఎలాంటి ఇబ్బంది లేదు.

First Published:  4 Oct 2019 1:02 AM GMT
Next Story