Telugu Global
NEWS

భారత బాక్సింగ్ జట్టుకు మేరీకోమ్ నాయకత్వం

ప్రపంచ బాక్సింగ్ బరిలో 10 మంది సభ్యుల భారతజట్టు 2019 ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలలో పాల్గొనే 10 మంది సభ్యుల భారతజట్టుకు ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ నాయకత్వం వహిస్తోంది. రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా ఈనెల 13 వరకూ జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో…భారత బాక్సర్లు మొత్తం 10 విభాగాలలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మేరీ కోమ్ కు అసలు పరీక్ష… భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ తన సుదీర్ఘ కెరియర్ లో తొమ్మిదోసారి […]

భారత బాక్సింగ్ జట్టుకు మేరీకోమ్ నాయకత్వం
X
  • ప్రపంచ బాక్సింగ్ బరిలో 10 మంది సభ్యుల భారతజట్టు

2019 ప్రపంచ మహిళా బాక్సింగ్ పోటీలలో పాల్గొనే 10 మంది సభ్యుల భారతజట్టుకు ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ నాయకత్వం వహిస్తోంది. రష్యాలోని ఉలాన్ ఉడే వేదికగా ఈనెల 13 వరకూ జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో…భారత బాక్సర్లు మొత్తం 10 విభాగాలలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

మేరీ కోమ్ కు అసలు పరీక్ష…

భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ తన సుదీర్ఘ కెరియర్ లో తొమ్మిదోసారి ప్రపంచ బాక్సింగ్ సమరానికి సిద్ధమయ్యింది. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ కు అర్హతగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ లో…మేరీకోమ్ ఈసారి 51 కిలోల విభాగం బరిలోకి దిగుతోంది.

36 ఏళ్ల వెటరన్ మేరీ కోమ్ కు ప్రపంచ బాక్సింగ్ లో ఆరు బంగారు పతకాలతో పాటు…ఓ రజత పతకం సాధించిన రికార్డు ఉంది. గతంలో 48 కిలోల విభాగంలో తిరుగులేని విజయాలు సాధించిన మేరీకోమ్ కు …51 కిలోల విభాగంలో అంతంత మాత్రం రికార్డే ఉంది.

ఒలింపిక్స్ లో కాంస్య, ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన మేరీ కోమ్…ప్రస్తుత ప్రపంచ బాక్సింగ్ లో మాత్రం అసలు సిసలు పరీక్ష ఎదుర్కోనుంది.

60 కిలోల విభాగంలో సరితాదేవి పోటీ…

మహిళల 60 కిలోల విభాగంలో సీనియర్ బాక్సర్ సరితాదేవి మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనుంది. 48 కిలోల విభాగంలో మంజురాణి, 54 కిలోల విభాగంలో జమునా బోరో, 57 కిలోల విభాగంలో నీరజ, 64 కిలోల విభాగంలో మంజు బంబోరియా, 69 కిలోల విభాగంలో లవ్లీన్ బోర్గెయిన్, 75 కిలోల విభాగంలో స్వాతీ బోరా, 81 కిలోల విభాగంలో నందిని, 81 కిలోలు ఆపైన తరగతిలో కవిత చాహల్ భారత్ కు ప్రాతినిథ్యం వహించబోతున్నారు.

గత మహిళా ప్రపంచకప్ లో నాలుగు పతకాలు సాధించిన భారత బాక్సర్లు…ప్రస్తుత ప్రపంచకప్ లో ఐదుకు పైగా పతకాలు సాధించే అవకాశం ఉందని… చీఫ్ కోచ్ మహ్మద్ అలీ ఖమర్ ధీమాగా చెబుతున్నారు.

First Published:  4 Oct 2019 2:27 AM GMT
Next Story