రీమేక్ మూవీ లో….. మోహన్ బాబు

విలక్షణ నటుడు మోహన్ బాబు తిరిగి పూర్తి స్థాయి లో వరుసగా సినిమాలు మొదలు పెట్టనున్నారు అనే వార్తలు వచ్చాయి. ఆయన త్వరలో నే ఒక సినిమా లో ముఖ్య పాత్ర చేయనున్నారట. హాలీవుడ్ లో వచ్చిన గోయింగ్ ఇన్ స్టైల్ అనే సినిమా ని ఆధారం గా చేసుకొని తెలుగు లో ఒక సినిమా చేయనున్నారట మోహన్ బాబు.

ఈ సినిమా మొత్తం ఒక బ్యాంకు రాబరీ చుట్టూ తిరుగుతుంది అనేది సమాచారం. అయితే ఈ సినిమా లో మోహన్ బాబు తో పాటు మరొక ఇద్దరు సీనియర్ నటులు కూడా నటించనున్నారట. తమకి రెగ్యులర్ గా పెన్షన్ ఇచ్చే బ్యాంకు… అది ఆపేయడం తో ఆ బ్యాంకు కే కన్నం వేయాలని ప్లాన్ చేస్తారట ఈ ముగ్గురు.

బీ వీ ఎస్ రవి ఈ సినిమా కి దర్శకత్వం వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. మోహన్ బాబే ఈ సినిమాని నిర్మించే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమా కి సంబందించిన అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది.