Telugu Global
International

అక్కడ ముస్లింలు మాత్రమే ప్రధాని, అధ్యక్ష పదవికి అర్హులు

ముస్లిమేతరులు ప్రధానిగా, దేశ అధ్యక్షుడిగా ఉండటానికి రాజ్యాంగ సవరణ కోరుతున్న బిల్లును పాకిస్తాన్ పార్లమెంటు అడ్డుకుంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన క్రైస్తవ శాసనసభ్యుడు డాక్టర్ నవీద్ అమీర్ జీవా, ముస్లిమేతరులు… ప్రధానమంత్రి, అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అడ్డువస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 41, 91 ను సవరించడానికి ఒక బిల్లును బుధవారం ప్రవేశ పెట్టాలని కోరారు. అయితే, ప్రతిపాదిత చట్టాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలీ మహమ్మద్ వ్యతిరేకించారు. పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అని, అక్కడ ముస్లిం […]

అక్కడ ముస్లింలు మాత్రమే ప్రధాని, అధ్యక్ష పదవికి అర్హులు
X

ముస్లిమేతరులు ప్రధానిగా, దేశ అధ్యక్షుడిగా ఉండటానికి రాజ్యాంగ సవరణ కోరుతున్న బిల్లును పాకిస్తాన్ పార్లమెంటు అడ్డుకుంది.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన క్రైస్తవ శాసనసభ్యుడు డాక్టర్ నవీద్ అమీర్ జీవా, ముస్లిమేతరులు… ప్రధానమంత్రి, అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అడ్డువస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 41, 91 ను సవరించడానికి ఒక బిల్లును బుధవారం ప్రవేశ పెట్టాలని కోరారు.

అయితే, ప్రతిపాదిత చట్టాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలీ మహమ్మద్ వ్యతిరేకించారు.

పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అని, అక్కడ ముస్లిం మాత్రమే అధ్యక్షుడు, ప్రధానమంత్రి అవుతారని మంత్రి అన్నారు.

అయితే ఈ చర్యను రైట్ వింగ్ జమాతే ఎ ఇస్లామి (జెఐ) సభ్యుడు మౌలానా అబ్దుల్ అక్బర్ చిత్రాలి ప్రశంసించారు.

First Published:  4 Oct 2019 9:34 AM GMT
Next Story