Telugu Global
NEWS

ప్రో-కబడ్డీ ప్లేఆఫ్ రౌండ్లో ముంబై, బెంగళూరు

లీగ్ దశ నుంచే పట్నా పైరేట్స్ అవుట్ ప్రో-కబడ్డీ లీగ్ 7వసీజన్ ప్లేఆఫ్ రౌండ్ కు…డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్, మాజీ చాంపియన్ యూ-ముంబా అర్హత సాధించగా…మూడుసార్లు విజేత పట్నా పైరేట్స్ పోటీ లీగ్ దశలోనే ముగిసింది. పంచకుల వేదికగా ముగిసిన లీగ్ దశ ఆఖరి అంచె పోటీలలో పట్నా పైరేట్స్ ను యూ-ముంబా, హర్యానా స్టీలర్స్ ను బెంగళూరు బుల్స్ అధిగమించడం ద్వారా ప్లే ఆఫ్ రౌండ్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి. ప్లే ఆఫ్ రౌండ్ చేరాలంటే […]

ప్రో-కబడ్డీ ప్లేఆఫ్ రౌండ్లో ముంబై, బెంగళూరు
X
  • లీగ్ దశ నుంచే పట్నా పైరేట్స్ అవుట్

ప్రో-కబడ్డీ లీగ్ 7వసీజన్ ప్లేఆఫ్ రౌండ్ కు…డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్, మాజీ చాంపియన్ యూ-ముంబా అర్హత సాధించగా…మూడుసార్లు విజేత పట్నా పైరేట్స్ పోటీ లీగ్ దశలోనే ముగిసింది.

పంచకుల వేదికగా ముగిసిన లీగ్ దశ ఆఖరి అంచె పోటీలలో పట్నా పైరేట్స్ ను యూ-ముంబా, హర్యానా స్టీలర్స్ ను బెంగళూరు బుల్స్ అధిగమించడం ద్వారా ప్లే ఆఫ్ రౌండ్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి.

ప్లే ఆఫ్ రౌండ్ చేరాలంటే నెగ్గితీరాల్సిన ఆఖరి రౌండ్ పోటీలలో యూ-ముంబా 30-26 పాయింట్లతో పట్నా పైరేట్స్ ను కంగు తినిపించింది. మరో పోటీలో ప్రస్తుత చాంపియన్ బెంగళూరు బుల్స్ 59-36 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్ ను చిత్తు చేసింది.

లీగ్ టేబుల్ టాపర్ ఢిల్లీ దబాంగ్, బెంగాల్ వారియర్స్ జట్లు ప్లే-ఆఫ్ రౌండ్ కు చేరుకొన్నాయి.

ఢిల్లీ దబాంగ్ అగ్రస్థానం…

ప్రస్తుత సీజన్ కబడ్డీ లీగ్ లో మొత్తం 12 జట్లు తలపడగా…ఢిల్లీ దబాంగ్,బెంగాల్ వారియర్స్, హర్యానా స్టీలర్స్, యూ-ముంబా, బెంగళూరు బుల్స్ లీగ్ టేబుల్ మొదటి ఐదుస్థానాలలో చోటు సంపాదించాయి.

లీగ్ దశలో మొత్తం 20 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ దబాంగ్ 15 విజయాలు, 3 పరాజయాలు, 2 టై ఫలితాలతో సహా మొత్తం 82 పాయింట్లు సాధించి లీగ్ టేబుల్ అగ్రస్థానం సంపాదించింది.

78 పాయింట్లతో బెంగాల్ వారియర్స్ రెండు, 65 పాయింట్లతో హర్యానా స్టీలర్స్ మూడు, 64 పాయింట్లతో యూ-ముంబా నాలుగు, 63 పాయింట్లతో బెంగళూరు బుల్స్ ఐదు, 58 పాయింట్లతో యూపీ యోధా ఆరు స్థానాలలో నిలవడం ద్వారా ప్లే-ఆఫ్ రౌండ్లో చోటు ఖాయం చేసుకోగలిగాయి.

గత 10 వారాలుగా సాగిన 12 జట్ల లీగ్ దశ పోటీలకు పంచకులా లెగ్ తో తెరపడింది.

14 నుంచి ప్లే-ఆఫ్ హంగామా

మొత్తం 12జట్ల రౌండ్ రాబిన్ లీగ్ మొదటి ఆరుస్థానాలలో నిలిచిన జట్ల మధ్య జరిగే ప్లేఆఫ్ సమరం అక్టోబర్ 14 నుంచి అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది.

అక్టోబర్ 14 జరిగే ఎలిమినేటర్ -1 పోటీలో లీగ్ లో 3వ స్థానం సాధించిన జట్టుతో 6వ స్థానంలో నిలిచినజట్టు తలపడుతుంది. అదేరోజున జరిగే ఎలిమినేటర్-2 రౌండ్లో లీగ్ 4వ ర్యాంక్ జట్టుతో 5వ ర్యాంక్ జట్టు పోటీపడుతుంది.

అక్టోబర్ 16న సెమీఫైనల్స్…

అక్టోబర్ 16న జరిగే తొలిసెమీఫైనల్లో లీగ్ టాప్ ర్యాంకర్ జట్టుతో…ఎలిమినేటర్-1 విజేత జట్టు తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో లీగ్ టేబుల్ రెండో ర్యాంక్ జట్టుతో ఎలిమినేటర్-2 విన్నర్ జట్టు ఢీ కొంటుంది.

అక్టోబర్ 19న టైటిల్ ఫైట్..

సెమీఫైనల్స్ లో విజయాలు సాధించిన రెండుజట్ల మధ్య అక్టోబర్ 19న టైటిల్ ఫైట్ నిర్వహిస్తారు. ఈ పోటీతో లీగ్ 7వ సీజన్ కు తెరపడనుంది.

ప్రో-కబడ్డీ లీగ్ గత ఆరుసీజన్లలో అత్యధిక టైటిల్స్ సాధించినజట్టుగా పట్నా పైరేట్స్ నిలిచింది.

పట్నా పైరేట్స్ మూడుసార్లు, జైపూర్ పింక్ పాంథర్స్, యూ-ముంబా, బెంగళూరు బుల్స్ జట్లు ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి.

First Published:  3 Oct 2019 9:28 PM GMT
Next Story