సై రా…. అందుకే ఒప్పుకున్నాను

గాంధీ జయంతి నాడు విడుదల అయ్యి దేశవ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా సైరా నరసింహ రెడ్డి. ఈ సినిమా ని బాగా ప్రమోట్ చేసిన దర్శక నిర్మాతలు ఇప్పుడు సినిమా కి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ కి థ్రిల్ అవుతున్నారు.

అంతే కాకుండా ఈ సినిమా లో పని చేసిన నటీ నటులు అందరికీ ఎంతో మంచి పేరు వస్తుంది. కేవలం చిరంజీవి ని మాత్రమే కాకుండా మిగిలిన నటుల ని కూడా పొగడ్తలతో ముంచేస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా లక్ష్మి అనే నాట్యకారిణి పాత్ర ని పోషించిన తమన్నా కి ఇది కెరీర్ బెస్ట్ పాత్ర గా గుర్తింపు వస్తోంది.

అయితే ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు తమన్నా చేయాలా వద్దా అనే ఆలోచన చేసినట్టు తెలిపింది. “ఈ సినిమా అవకాశం రాగానే కొంత ఆలోచించాను. బాహుబలి తర్వాత మరొక పీరియడ్ సినిమా చేయాలి అని అనుకోలేదు. ఎందుకంటే, నేను ఏది చేసినా, మళ్ళీ అవంతిక పాత్ర తో పోలుస్తారు. కాకపోతే సై రా లో మంచి కథ ఉంది, నా పాత్ర నచ్చింది, అంతే కాకుండా చిరంజీవి గారి వంటి వాళ్ళతో పని చేయడం సంతోషంగా అనిపించింది. అందుకనే వెంటనే ఒప్పుకున్నాను” అని తమన్నా ఇటీవలే తెలిపింది.