Telugu Global
Cinema & Entertainment

తమన్నాకు చరణ్ భార్య చిరు కానుక

రామ్ చరణ్, తమన్న కేవలం హీరోహీరోయిన్లు మాత్రమే కాదు. మంచి ఫ్రెండ్స్ కూడా. చరణ్ ను “రా” అని పిలిచేంత చనువు తమన్నాది. ఇప్పుడు వీళ్లిద్దరు మాత్రమే కాదు, ముగ్గురయ్యారు. అవును.. చరణ్ భార్య ఉపాసన కూడా తమన్నకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఎంతలా అంటే.. సైరాలో తమన్న యాక్టింగ్, డాన్స్ చూసి ఉపాసన చలించిపోయింది. వెంటనే తన రేంజ్ లో ఓ కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చింది. నిన్న రాత్రి అల్లు అరవింద్ ఇంట్లో సైరా […]

తమన్నాకు చరణ్ భార్య చిరు కానుక
X

రామ్ చరణ్, తమన్న కేవలం హీరోహీరోయిన్లు మాత్రమే కాదు. మంచి ఫ్రెండ్స్ కూడా. చరణ్ ను “రా” అని పిలిచేంత చనువు తమన్నాది. ఇప్పుడు వీళ్లిద్దరు మాత్రమే కాదు, ముగ్గురయ్యారు. అవును.. చరణ్ భార్య ఉపాసన కూడా తమన్నకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఎంతలా అంటే.. సైరాలో తమన్న యాక్టింగ్, డాన్స్ చూసి ఉపాసన చలించిపోయింది. వెంటనే తన రేంజ్ లో ఓ కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చింది.

నిన్న రాత్రి అల్లు అరవింద్ ఇంట్లో సైరా ప్రైవేట్ పార్టీ జరిగింది. మెగా ఫ్యామిలీ సభ్యులందరితో పాటు యూనిట్ సభ్యులు ఈ పార్టీకి వచ్చారు. స్వయంగా అల్లు అరవింద్ ఈ పార్టీ ఇచ్చాడు. పార్టీకి కొద్దిసేపటి ముందు అల్లు అర్జున్.. ఏఎంబీ మాల్ లో సైరా సినిమా చూసి నేరుగా పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈ పార్టీలోనే ఉపాసన స్వయంగా ఓ చేతి ఉంగరాన్ని తమన్నాకు అందించింది.

ఉపాసన ఇచ్చిన గిఫ్ట్ చూసి తమన్న మురిసిపోయింది. ఆమెకు మాటలు రాలేదు. కేవలం కన్నీళ్లు మాత్రమే వచ్చాయి. తనకు అందిన ఓ బహుమతిని తమన్న బయటపెట్టింది కూడా. అలా తమన్న-ఉపాసన మధ్య ఉన్న బాండింగ్ కూడా సైరా వల్ల అందరికీ తెలిసొచ్చింది.

First Published:  4 Oct 2019 1:04 AM GMT
Next Story