Telugu Global
National

టీడీపీ నుంచి బీజేపీలోకి మరో ఆర్ధిక నేరస్తుడు

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టడంతో పాటు, పలు నేరాలకు సంబంధించి కేసుల్లో ఇరుకున్న టీడీపీ నేతల చేరికలు బీజేపీలోకి కొనసాగుతున్నాయి. ఇప్పటికే బ్యాంకులకు ఆరు వేల కోట్లు ఎగ్గొట్టడంతో సీబీఐ, ఈడీ కేసులు నమోదు అయిన తర్వాత బీజేపీలో చేరిన ఎంపీ సుజనాచౌదరి ఇప్పుడు అక్కడ హాయిగా ఉంటున్నారు. అదే సమయంలో దాదాపు అదే పరిస్థితులు ఎదుర్కొన్న సీఎం రమేష్ కూడా బీజేపీలో చేరి ఆరాంగా ఉంటున్నారు. వారిని చూసిన తర్వాత చాలా మంది వివాదాస్పద టీడీపీ […]

టీడీపీ నుంచి బీజేపీలోకి మరో ఆర్ధిక నేరస్తుడు
X

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టడంతో పాటు, పలు నేరాలకు సంబంధించి కేసుల్లో ఇరుకున్న టీడీపీ నేతల చేరికలు బీజేపీలోకి కొనసాగుతున్నాయి. ఇప్పటికే బ్యాంకులకు ఆరు వేల కోట్లు ఎగ్గొట్టడంతో సీబీఐ, ఈడీ కేసులు నమోదు అయిన తర్వాత బీజేపీలో చేరిన ఎంపీ సుజనాచౌదరి ఇప్పుడు అక్కడ హాయిగా ఉంటున్నారు.

అదే సమయంలో దాదాపు అదే పరిస్థితులు ఎదుర్కొన్న సీఎం రమేష్ కూడా బీజేపీలో చేరి ఆరాంగా ఉంటున్నారు. వారిని చూసిన తర్వాత చాలా మంది వివాదాస్పద టీడీపీ నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు.

కడప జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి అందుకు తహతహలాడుతున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో కే – ట్యాక్స్‌తో పాటు వివిధ నేరాలకు పాల్పడడం వల్ల కేసులు నమోదు కావడంతో ఆత్మహత్యకు ముందు కోడెల శివప్రసాదరావు కూడా బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారు.

తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి కూడా బీజేపీలో చేరారు. ఈయనది కూడా బ్యాంకులకు వందల కోట్లు ఎగొట్టి సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న కేటగిరినే. ఈ కేసుల్లో వాకాటిని కొద్దికాలం పాటు సీబీఐ అరెస్ట్‌ చేసి లోపలేసింది.

తప్పుడు పత్రాల సాయంలో రూ.950 కోట్లు బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని తిరిగి చెల్లించకుండా వాకాటి ఎగ్గొట్టారు. ఈ ఆరోపణలు ఉన్న సమయంలోనే వాకాటికి చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.

ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసినప్పుడు మాత్రం వాకాటితో తమకు సంబంధం లేదని ప్రకటించారు చంద్రబాబు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు బీజేపీలో చేరిపోవడంతో ఇక వాకాటి నారాయణరెడ్డికి సీబీఐ, ఈడీ లాంటి సంస్థల నుంచి ఎలాంటి వేధింపులు ఉండవని చెబుతున్నారు. ఆ ధైర్యం కోసమే ఆయన బీజేపీలో చేరారంటున్నారు.

First Published:  3 Oct 2019 8:31 PM GMT
Next Story