Telugu Global
NEWS

విశాఖ టెస్టు పై భారత్ పట్టు

రోహిత్-మయాంక్ 317 పరుగుల రికార్డు సౌతాఫ్రికాతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా…విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలిటెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికే ఆతిథ్య భారత్ పట్టు బిగించింది. తొలిఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 502 పరుగుల భారీస్కోరుతో భారత్ డిక్లేర్ చేసింది. సమాధానంగా రెండోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 39 పరుగుల స్కోరుతో ఎదురీదుతోంది. మొదటి వికెట్ కు సరికొత్త రికార్డు… అంతకుముందు భారత […]

విశాఖ టెస్టు పై భారత్ పట్టు
X
  • రోహిత్-మయాంక్ 317 పరుగుల రికార్డు

సౌతాఫ్రికాతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా…విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలిటెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికే ఆతిథ్య భారత్ పట్టు బిగించింది.

తొలిఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 502 పరుగుల భారీస్కోరుతో భారత్ డిక్లేర్ చేసింది. సమాధానంగా రెండోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 39 పరుగుల స్కోరుతో ఎదురీదుతోంది.

మొదటి వికెట్ కు సరికొత్త రికార్డు…

అంతకుముందు భారత ఓపెనర్లు రోహిత్ శర్మ- మయాంక్ అగర్వాల్ మొదటి వికెట్ కు 317 పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త రికార్డు నమోదు చేశారు.

రోహిత్ 244 బాల్స్ లో 23 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 176 పరుగులకు అవుట్ కాగా…మరో ఓపెనర్ మయాంక్ 371 బాల్స్ లో 23 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 215 పరుగులు సాధించి…భారత్ భారీ విజయానికి పునాది వేశారు.

సౌతాఫ్రికా పై 11సంవత్సరాల క్రితం భారత ఓపెనింగ్ జోడీ రాహుల్ ద్రావిడ్ – వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన 268 పరుగుల రికార్డును రోహిత్- మయాంక్ జోడీ 317 పరుగులతో తెరమరుగు చేశారు.

హేమాహేమీల సరసన మయాంక్…

యువఓపెనర్ మయాంక్ అగర్వాల్…టెస్ట్ క్రికెట్లో తన తొలి మూడంకెల స్కోరును డబుల్ సెంచరీగా మలచుకొని…మరో ముగ్గురు హేమాహేమీల సరసన చోటు సంపాదించాడు.దిలీప్ సర్దేశాయి, వినోద్ కాంబ్లీ, కరుణ్ నాయర్ టెస్ట్ క్రికెట్లో తమ తొలి శతకాలను డబుల్ సెంచరీలతో ముగించారు.

టెస్ట్ క్రికెట్లో సెంచరీ బాదిన భారత 86వ క్రికెటర్ గా మయాంక్ అగర్వాల్ రికార్డుల్లో చోటు సంపాదించాడు.
టెస్ట్ మ్యాచ్ మూడు, నాలుగురోజుల ఆటలో వరుణుడు కరుణిస్తే భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించినా ఆశ్చర్యం లేదు.

First Published:  3 Oct 2019 7:02 PM GMT
Next Story