Telugu Global
NEWS

సోషల్ మీడియా నీచానికి బాబే బాధ్యుడు... ఓడిపోయిన లోకేష్‌తో చర్చకు నేను సిద్దం

సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌పై చంద్రబాబునాయుడు చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. చర్చ కోసం తాము ఎక్కడికైనా వస్తామన్నారు. రెండు వేల మంది పెయిడ్‌ సోషల్ మీడియా కార్యకర్తలను నియమించి వైఎస్ కుటుంబంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించలేదా అని ప్రశ్నించారు. ఇది రుజువు చేస్తే చంద్రబాబు, లోకేష్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ చేశారు. సోషల్ మీడియాలో కామెంట్స్‌పై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబునాయుడు… పక్కనే […]

సోషల్ మీడియా నీచానికి బాబే బాధ్యుడు... ఓడిపోయిన లోకేష్‌తో చర్చకు నేను సిద్దం
X

సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌పై చంద్రబాబునాయుడు చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. చర్చ కోసం తాము ఎక్కడికైనా వస్తామన్నారు. రెండు వేల మంది పెయిడ్‌ సోషల్ మీడియా కార్యకర్తలను నియమించి వైఎస్ కుటుంబంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించలేదా అని ప్రశ్నించారు.

ఇది రుజువు చేస్తే చంద్రబాబు, లోకేష్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ చేశారు. సోషల్ మీడియాలో కామెంట్స్‌పై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబునాయుడు… పక్కనే మహిళా నాయకులు ఉన్నప్పటికీ బూతు పదాలను ఉచ్చరించడానికి నోరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.

చంద్రబాబు ఇప్పటికీ తనను తాను నాయకుడు అని ఎలా చెప్పుకుని తిరుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకు కనీసం సిగ్గు ఉందా అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పోస్టు పెడితే దానిపై చర్చ పెట్టేస్థాయికి దిగజారిన మాజీ ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎక్కడైనా ఉన్నారా అని నిలదీశారు.

చంద్రబాబుకు దమ్ముంటే ప్రభుత్వ విధానాలపై చర్చకు రావాలి గానీ… సిగ్గులేకుండా దిగజారిపోయి సోషల్ మీడియా పోస్టులపై చర్చలు ఏమిటని విమర్శించారు. చంద్రబాబు మానసిక స్థితిలో ఏదో తేడా ఉందని… తక్షణం వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి నగ్నంగా రోడ్డుపై తిరిగితే ఎలా ఉంటుందో చంద్రబాబు తీరు కూడా అలాగే ఉందన్నారు.

బీజేపీ నేతలు చంద్రబాబు ఇంటి మీద గద్దలా తిరుగుతున్నారు కాబట్టే…. చంద్రబాబుకు దిక్కుతోచడం లేదన్నారు. ప్రత్యర్థులపై నీచ ప్రచారం చేయించే విషవృక్షానికి బీజం వేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ నుంచి ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతి వరకు వాళ్ళపై వ్యతిరేక ప్రచారం చేయించకుండా ఎవరినైనా చంద్రబాబు వదిలిపెట్టారా అని సుధాకర్‌ బాబు ప్రశ్నించారు.

షర్మిలపై నీచంగా ప్రచారం చేయించింది, వరద సమయంలో మంత్రి అనిల్ కుమార్ కులాన్ని పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టించింది చంద్రబాబు కాదా అని వ్యాఖ్యానించారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న నీచ ప్రచారానికి బాధ్యులు చంద్రబాబు, నారా లోకేషే అని తాను నిరూపించేందుకు సిద్దంగా ఉన్నానని… దీనిపై చర్చకు రావాలన్నారు. చంద్రబాబు స్థాయికి తాను తగను అనుకుంటే…. ఎమ్మెల్యేగా గెలిచిన తనతో చర్చకు… ఎమ్మెల్యేగా ఓడిన నారా లోకేష్‌ నైనా పంపించాలన్నారు.

First Published:  4 Oct 2019 6:01 AM GMT
Next Story