Telugu Global
Cinema & Entertainment

'చాణక్య' సినిమా రివ్యూ

రివ్యూ : చాణక్య రేటింగ్ : 2/5 తారాగణం : గోపిచంద్, మెహరీన్ పిర్జాదా, జరీన్ ఖాన్, రాజేష్ ఖట్టర్, అరుణ్ కుమార్ తదితరులు సంగీతం : విశాల్ చంద్రశేఖర్ నిర్మాత : రామబ్రహ్మం సుంకర దర్శకత్వం : తిరు గోపీచంద్, మెహరీన్ పిర్జాదా జంటగా నటించిన సినిమా చాణక్య. ఈ సినిమా కి దర్శకత్వం వహించింది తిరు. అనిల్ సుంకర నిర్మాణం లో వచ్చిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా లో […]

చాణక్య సినిమా రివ్యూ
X

రివ్యూ : చాణక్య
రేటింగ్ : 2/5
తారాగణం : గోపిచంద్, మెహరీన్ పిర్జాదా, జరీన్ ఖాన్, రాజేష్ ఖట్టర్, అరుణ్ కుమార్ తదితరులు
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర

దర్శకత్వం : తిరు

గోపీచంద్, మెహరీన్ పిర్జాదా జంటగా నటించిన సినిమా చాణక్య. ఈ సినిమా కి దర్శకత్వం వహించింది తిరు. అనిల్ సుంకర నిర్మాణం లో వచ్చిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా లో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్ర లో నటించింది.

కథ:

అర్జున్ (గోపీచంద్) ఒక అండర్ కవర్ రా ఏజెంట్. ఒక ఆపరేషన్ విషయమై ఒక టెర్రరిస్ట్ ని చంపేయగా, అతని అనుచరులు అర్జున్ స్నేహితులని కిడ్నప్ చేసి రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటారు.

అయితే ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళ తో నే ఒక ఉగ్రవాద దాడి చేయించి భారత దేశం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? తన దేశాన్ని, స్నేహితులని కాపాడటానికి ఏం చేసాడు? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా కథ.

నటీనటులు:

గోపీచంద్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఎన్నడూ కనిపించనటువంటి పాత్రలో గోపీచంద్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. తన పాత్రలో ఒదిగిపోయి గోపీచంద్ ఈ సినిమాలో బాగా నటించాడు.

మెహరీన్ పిర్జాదా తన పాత్ర పరిధిలో బాగానే నటించింది. తన పాత్రకి అంత ప్రాధాన్యత లేకపోయినప్పటికీ గోపిచంద్ తో ఆమె కెమిస్ట్రీ బాగానే ఉంది. లుక్స్ పరంగా మాత్రమే కాక నటన పరంగా కూడా మంచి మార్కులే వేయించుకుంది.

జరీన్ ఖాన్ నటన సినిమాకి బాగా ప్లస్ అయింది. ఈ సినిమాలో ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

రాజేష్ ఖట్టర్ చాలా సహజంగా నటించారు. అరుణ్ కుమార్ కూడా బాగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు తిరు ఈ సినిమా కోసం కథని ఎంపిక చేసుకోవడంలోనే విఫలమయ్యాడు. అయితే డైరెక్టర్ తిరు ఇప్పటిదాకా చేసింది తమిళ సినిమాలే అయినప్పటికీ…. తెలుగు ప్రేక్షకుల పల్స్ ని పట్టడంలో కొద్దిమేర సక్సెస్ అయ్యాడు.

కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించి ఈ సినిమాతో మన ముందుకు వచ్చాడు. కానీ ప్రేక్షకులను మెప్పించలేక…. బోర్ కొట్టించాడు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం సినిమాకు వర్కౌట్ అవ్వలేదు. పాటల ప్లేస్ మెంట్ బాలేదు. వెట్రి పలనిసామి సినిమాటోగ్రఫీ బాగుంది. అతని కెమెరా యాంగిల్స్ మరియు విజువల్స్ బాగున్నాయి.

తీర్పు:

ఈ సినిమా కథ అంతంత మాత్రమే కానీ… కథనం మాత్రం కొంచెం ఆసక్తి గా ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదటి భాగం మొత్తం కొన్ని ట్విస్ట్ లతో సాగుతూ ఉంటుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లతో దర్శకుడు బోర్ కొట్టించాడు.

ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఓకే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. అయితే ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సాగతీత సన్నివేశాలు సినిమాకి మైనస్ గా మారాయి. హీరో హీరోయిన్ ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ బాగా బోర్ కొట్టిస్తుంది. కామెడీ సన్నివేశాలు కూడా సరిగ్గా పేలలేదు.

చివరిగా ‘చాణక్య’ సినిమా ని ఓపిక తెచ్చుకొని చూడాల్సిందే.

First Published:  5 Oct 2019 6:56 AM GMT
Next Story