టీ-20 క్రికెట్లో హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డు

  • 100 టీ-20 మ్యాచ్ ల హర్మన్ ప్రీత్ కౌర్
  • ధోనీ, రోహిత్ శర్మలను మించిన హర్మన్ ప్రీత్

మహిళా క్రికెట్లో భారత టీ-20 జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్…ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. సూరత్ వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన ఆరో టీ-20 మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా…భారత్ తరపున వంద టీ-20 మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరింది.

భారత పురుషుల, మహిళల విభాగాలలో వంద అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లు ఆడిన తొలి, ఏకైక క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే కావడం విశేషం.

మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ చెరో 98 టీ-20మ్యాచ్ లు ఆడి… హర్మన్ ప్రీత్ కౌర్ తర్వాతి స్థానంలో నిలిచారు.

అంతర్జాతీయ మహిళా క్రికెట్ చరిత్రలో 100 టీ-20 మ్యాచ్ లు ఆడిన పదో క్రికెటర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డుల్లో చోటు సంపాదించింది.