Telugu Global
International

స్వయంగా అంబులెన్స్‌ను నడిపిన లేడీ డాక్టర్

తన పరిధికి మించి ఓ డాక్టర్ తన పేషెంట్ కోసం సమయస్ఫూర్తితో వ్యవహరించడం అందరి మన్ననలకు పాత్రమయింది. మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ జిల్లాకు చెందిన ఒక డాక్టర్ తన పేషెంట్ పరిస్థితి విషమిస్తూ ఉండటం తో సమీపంలోని ఆసుపత్రికి అమెని చేర్చడానికి అంబులెన్స్‌ను నడిపింది. డాక్టర్ బల్నాంచి సంగ్మా తాను పనిచేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి నుంచి గర్భిణీ స్త్రీని సమీపంలోని ఆసుపత్రికి మార్చాల్సిన అవసరం వచ్చింది. కానీ అంబులెన్స్ డ్రైవర్లు ఇద్దరూ సెలవులో ఉన్నారని తెలుసుకున్న […]

స్వయంగా అంబులెన్స్‌ను నడిపిన లేడీ డాక్టర్
X

తన పరిధికి మించి ఓ డాక్టర్ తన పేషెంట్ కోసం సమయస్ఫూర్తితో వ్యవహరించడం అందరి మన్ననలకు పాత్రమయింది. మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ జిల్లాకు చెందిన ఒక డాక్టర్ తన పేషెంట్ పరిస్థితి విషమిస్తూ ఉండటం తో సమీపంలోని ఆసుపత్రికి అమెని చేర్చడానికి అంబులెన్స్‌ను నడిపింది.

డాక్టర్ బల్నాంచి సంగ్మా తాను పనిచేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి నుంచి గర్భిణీ స్త్రీని సమీపంలోని ఆసుపత్రికి మార్చాల్సిన అవసరం వచ్చింది. కానీ అంబులెన్స్ డ్రైవర్లు ఇద్దరూ సెలవులో ఉన్నారని తెలుసుకున్న ఆమె, రోగిని తురాలోని ప్రసూతి, పిల్లల హాస్పిటల్ (ఎంసిహెచ్) కు తరలించడానికి అంబులెన్స్ ని 36 కిలోమీటర్లు నడిపింది.

ఆమె అంబులెన్స్ నడుపుతూ పోతుంటే దారి పొడవునా చూసిన జనం ఆశ్చర్యపోయి ఆమెను వారి సెల్ ఫోన్లలో బంధించారు. ప్రసూతి కేంద్రానికి చేరుకున్నప్పుడూ మహిళ అంబులెన్స్ నడుపుతుండటం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.
అంబులెన్స్ నడుపుతున్న ఆమె చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

అత్యవసరంగా పేషెంట్ ని ఎందుకు మార్చవలసి వచ్చిందో వివరిస్తూ సంగ్మా… గర్భిణీ ప్రసవించబోతున్నది… కానీ కష్టపడుతున్నది. ఆమె సోనోగ్రఫీ పరీక్షను తిరస్కరించడంతో శిశువు పరిస్థితి గురించి వైద్యులు క్లూలెస్‌గా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాతనే ఆమెను ఎంసిహెచ్‌కు మార్చాలని వైద్యులు నిర్ణయించారు.

“ఆ రోజునే, 108 సేవల ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. మా డ్రైవర్లు సాధారణ సెలవులో ఉన్నారు” అని ఆమె చెప్పారు. పేషెంట్ కుటుంబం పేదగా ఉన్నందున, వాహనాన్ని ఏర్పాటు చేయమని తాను వారిని అడగలేదని ఆమె అన్నారు. ఇక ఆలస్యం చేస్తే తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రమాదంలో పడతారని భావించి తానే అంబులెన్స్ నడుపుతూ ఆమెను ఎంసిహెచ్ కి చేర్చానని సంగ్మా అన్నారు.

“ప్రజలు తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి సమాజం పట్ల కొంచెం దయ చూపాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం కష్టమే అయినప్పటికీ దాన్ని ప్రయత్నించడం కష్టం కాదు” అని సంగ్మా అన్నారు.

ఆమె చూపిన మానవత్వం ఇద్దరి ప్రాణాలను కాపాడింది. ఎట్టి పరిస్థితులలోనయినా ప్రాణాలను కాపాడతానని డాక్టర్ గా ఆమె చేసిన ప్రమాణాన్ని ఆమె తన పరిథికి మించి పనిచేసి నిలుపుకున్నది. ఆమె చర్య మానవత్వంపై విశ్వాసాన్ని పునరుద్ధరించింది.

First Published:  5 Oct 2019 12:53 AM GMT
Next Story