మీడియాకి దూరంగా ఉంది అందుకేనట !

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార గురించి తెలియని వారు ఉండరు. తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా మలయాళం లో కూడా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న నయన్… ఇండస్ట్రీ లో అడుగు పెట్టి దశాబ్దకాలం దాటింది.

ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పటికీ… నయనతార సినిమా ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనదు. అది కమర్షియల్ సినిమా అయినా లేక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ నయనతార మాత్రం మీడియా ముందుకి చాలా తక్కువసార్లు వచ్చింది.

అసలు మీడియాకి, ఇంటర్వ్యూల కి నయనతార ఎందుకు దూరంగా ఉంటుంది అనే విషయంపై ఈ మధ్యనే ఈ భామ రియాక్ట్ అయింది.

దాదాపు 10 ఏళ్లలో ఇదే తన మొదటి ఇంటర్వ్యూ అయి ఉంటుందని అన్న నయనతార ప్రతిసారి తన గురించి తాను చెప్పుకోవడం నచ్చదని… అందుకే అది ఇంటర్వ్యూ కి దూరంగా ఉంటానని చెప్పింది నయనతార.

“నేను ఏం ఆలోచిస్తున్నాను అనేది ప్రపంచానికి చెప్పటం నాకు ఇష్టం లేదు. నేను చాలా ప్రైవేట్ పర్సన్” అని అన్న నయనతార… మీడియా పై కూడా తనకి చాలా కోపంగా ఉన్నట్లు చెప్పింది.

ఇప్పటికే చాలాసార్లు తను అనని మాటలను కూడా హైలైట్ చేస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారని అందుకే ఇంటర్వ్యూలకి, మీడియాకి దూరంగా ఉంటానని చెప్పిన నయనతార…. తన జాబ్ కేవలం నటించడం మాత్రమేనని…. తన సినిమలే తన గురించి చెబుతాయని అంటోంది.