సై రా… మూడు రోజుల కలెక్షన్ ఇలా ఉంది…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆ అంచనాలను మించి కలెక్షన్లు అందుకుంటోంది.

అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలై బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

తాజాగా మూడవరోజు పూర్తయ్యేసరికి మొత్తం కలెక్షన్లు 54.50 కోట్లకు చేరుకున్నాయి. అయితే రెండవ రోజున కలెక్షన్లలో 30 శాతం డ్రాప్ ఏర్పడింది. అయినప్పటికీ కలెక్షన్లు బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు.

అయితే తాజాగా ఇవాళ గోపీచంద్ నటించిన ‘చాణక్య’ సినిమా కూడా విడుదల కావడంతో ‘సై రా’ కి కొన్ని థియేటర్లు తగ్గాయి. మరి ‘సైరా’ సినిమా ఎంతవరకు డిస్ట్రిబ్యూటర్లను సేఫ్ జోన్ లోకి తీసుకువెళుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.

మూడు రోజులలో ‘సైరా’ సినిమా ప్రాంతాల వారిగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి

  • నిజాం: 14.62 కోట్లు
  • సీడెడ్: 9.05 కోట్లు
  • యూఏ: 7.40 కోట్లు
  • గుంటూరు: 6.19 కోట్లు
  • ఈస్ట్: 5.71 కోట్లు
  • వెస్ట్: 4.63 కోట్లు
  • కృష్ణ: 4.25 కోట్లు
  • నెల్లూరు: 2.65 కోట్లు
  • ఏపీ + తెలంగాణ: 54.50 కోట్లు