సైరా ను చరణ్ తో తీయాలని అనుకున్నారట… కానీ….

సైరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎప్పటి నుంచో తనకి ఒక హిస్టారికల్ పాత్ర చేయాలని ఉండేదని అది ‘సై రా’ తో నెరవేరినట్లు చెప్పిన సంగతి తెలిసిందే.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం మెగా అభిమానులు మాత్రమే కాక మిగతా ప్రేక్షకులు కూడా చిరంజీవి అద్భుతమైన నటనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ‘సై రా’ సినిమా కోసం రామ్ చరణ్ పేరు ని సజెస్ట్ చేశాడట.

దాదాపు ఒక దశాబ్దం క్రితం చిరంజీవి తన రాజకీయ పనులతో బాగా బిజీగా ఉన్న సమయంలో ‘సై రా’ స్క్రిప్టుతో చిరంజీవిని కలిశారు పరుచూరి బ్రదర్స్. కథ కూడా వినిపించారు. చిరంజీవికి కథ చాలా బాగా నచ్చింది. అప్పటికి రాజకీయాలతో బిజీగా ఉండటంవల్ల చిరంజీవి సినిమాకోసం కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు.

అయితే ఈ సినిమా ఒకవేళ తను చేయకపోతే రామ్ చరణ్ చేస్తాడని చిరు పరుచూరి బ్రదర్స్ తో చెప్పారట. అయితే రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకున్న చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం తో మెగాస్టార్ కల నెరవేరింది.