Telugu Global
NEWS

శనివారం రిపోర్టు చేయకుంటే జాబ్ పోయినట్టే...

ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల కఠిన వైఖరి అవలంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఐఏఎస్ అధికారుల కమిటీ జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో పరిస్థితిని సీఎంకు అధికారులు వివరించారు. నేటి నుంచి సమ్మె మొదలవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్… సమ్మెకు వెళ్లే కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆరు గంటల్లోపు కార్మికులంతా ఆయా డిపోల్లో రిపోర్ట్ చేయాలని… అలా […]

శనివారం రిపోర్టు చేయకుంటే జాబ్ పోయినట్టే...
X

ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల కఠిన వైఖరి అవలంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఐఏఎస్ అధికారుల కమిటీ జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో పరిస్థితిని సీఎంకు అధికారులు వివరించారు. నేటి నుంచి సమ్మె మొదలవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్… సమ్మెకు వెళ్లే కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

శనివారం సాయంత్రం ఆరు గంటల్లోపు కార్మికులంతా ఆయా డిపోల్లో రిపోర్ట్ చేయాలని… అలా రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఉంచాలని ఆదేశించారు. శనివారం సాయంత్రంలోగా రిపోర్ట్ చేయని వారిని… తమకు తామే ఉద్యోగం మానేసి వెళ్లినట్టుగా గుర్తించాలని అధికారులకు స్పష్టం చేశారు. విధుల్లో చేరే కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చెప్పారు.

శనివారం సాయంత్రం 6లోగా విధుల్లో చేరని వారిని… తిరిగి వచ్చినా సరే విధుల్లోకి తీసుకోవద్దని ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించారు. కేసీఆర్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు కూడా ఉండవని ప్రకటించారు. చర్చల అవసరం లేనందున ఐఏఎస్‌లతో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

అటు కార్మిక సంఘాలు మాత్రం సమ్మె చేసి తీరుతామంటున్నారు. తమకు ఎస్మాలు, పీడీ యాక్ట్‌లు కొత్తేమీ కాదని సంఘాల నేతలు చెబుతున్నారు. ఉద్యోగాలు పోయినా పర్వాలేదని… ఒక్క కార్మికుడు కూడా విధులకు హాజరుకాబోరని సంఘాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలను ప్రభుత్వం మొదలుపెట్టింది. బస్సులను నడిపేందుకు తాత్కాలికంగా డ్రైవర్లను తీసుకుంటోంది. ఇప్పటికే నాలుగు వేల మంది డ్రైవర్లను ఎంపిక చేశారు. ఆర్టీసీలోని 2,100 అద్దె బస్సులు, మరో 6900 పాఠశాలలు, కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను ప్రయాణికుల కోసం ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇలా తీసుకున్న డ్రైవర్‌కు రోజుకు రూ. 15 వందలు చెల్లిస్తారు. కండక్టర్లకు వెయ్యి రూపాయల వేతనం ఇస్తారు.

సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లో నగర ప్రజలకు ఇబ్బందులను తొలగించేందుకు మెట్రో కూడా ముందుకొచ్చింది. సర్వీసు వేళల్లో మార్పులు చేసింది. సమ్మె సమయంలో ఉదయం 5 గంటల నుంచే మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 11.30 వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయి.

First Published:  4 Oct 2019 7:43 PM GMT
Next Story