Telugu Global
NEWS

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్... చంద్రబాబుకు బిగ్ షాక్...

ఒక నేత అరెస్ట్ అయితే సొంత పార్టీ వారు బాధపడడం, ప్రత్యర్థి పార్టీ వారు ఆనందించడం సహజం. కానీ వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్‌ ఉందంతం ఇందుకు భిన్నంగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్‌ను అధికార పార్టీ వారు గర్వంగా చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతలు సిగ్గుతో తల దించుకుంటున్నారు. కారణంగా చంద్రబాబు రూలింగ్ ట్రాక్‌ రికార్డే. చంద్రబాబు హయాంలో నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి […]

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్... చంద్రబాబుకు బిగ్ షాక్...
X

ఒక నేత అరెస్ట్ అయితే సొంత పార్టీ వారు బాధపడడం, ప్రత్యర్థి పార్టీ వారు ఆనందించడం సహజం. కానీ వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్‌ ఉందంతం ఇందుకు భిన్నంగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్‌ను అధికార పార్టీ వారు గర్వంగా చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతలు సిగ్గుతో తల దించుకుంటున్నారు. కారణంగా చంద్రబాబు రూలింగ్ ట్రాక్‌ రికార్డే.

చంద్రబాబు హయాంలో నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేశారు. చింతమనేని ఏకంగా ఆమెను ఇసుకలో పడేసి కొట్టాడు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి… చింతమనేని తరహాలో అధికారణిపై భౌతిక దాడి చేయకపోయినా ఆమె ఇంటికి వెళ్లి రభస చేశారు. అప్పట్లో చింతమనేనిపై వనజాక్షి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కోటంరెడ్డిపై ఎంపీడీవో సరళ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలు ఆయా ఎమ్మెల్యేల పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి.

ముఖ్యమంత్రుల హోదాలో చంద్రబాబు, జగన్‌ మోహన్ రెడ్డి స్పందించిన తీరులు మాత్రం పూర్తి భిన్నం. వనజాక్షిని ఇసుకలో పడేసి కొడుతున్న దృశ్యాలు క్లియర్‌గా ఉన్నా సరే నాడు చింతమనేనిని చంద్రబాబు అరెస్ట్ చేయించలేదు. పైగా చంద్రబాబే స్వయంగా పంచాయతీ చేశారు. వనజాక్షినే బెదరగొట్టి పంపించారు. నాడు చంద్రబాబు తనకిచ్చిన మద్దతుతో ఐదేళ్ల పాటు చింతమనేని తన ఇష్టానికి వ్యవహరించారు. టీడీపీ ఎన్నికల్లో మట్టికరిచిపోవడానికి తన వంతు పాత్రను చింతమనేని పోషించారు.

ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా మహిళా అధికారిణిని బెదిరించారు. కానీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబుకు భిన్నంగా వ్యవహరించారు. కోటంరెడ్డి తన పార్టీ ఎమ్మెల్యే అని మినహాయింపు ఇవ్వలేదు. తప్పు చేసి వుంటే అరెస్ట్‌ చేయాలని స్వయంగా డీజీపీని సీఎం ఆదేశించారు.

కోటంరెడ్డి అరెస్ట్‌కు జగన్‌ ఆదేశించి ఉండకపోతే చంద్రబాబు ఆయన మీడియా దీనిపై కావాల్సినంత రాజకీయం చేసి ఉండేది. కానీ ఇప్పుడు జగనే స్వయంగా అరెస్ట్‌కు ఆదేశించడం చంద్రబాబుకు పెద్ద చిక్కే. ఇప్పుడు అందరూ చింతమనేని, కోటంరెడ్డి కేసులను పోల్చి చూసి… అంతిమంగా నాడు సీఎం వ్యవహార శైలిని, నేటి సీఎం వ్యవహారశైలిని పోల్చి చూస్తున్నారు.

చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేసేలా పాలన సాగిస్తున్న జగన్‌మోహన్ రెడ్డిని చూసి వైసీపీ అభిమానులు ఇప్పుడు గర్వపడుతున్నారు. మహిళా ఎమ్మార్వోను ఇసుకలో పడేసి కొట్టిన తన పార్టీ ఎమ్మెల్యేకు కొమ్ముకాసిన చంద్రబాబును చూసి టీడీపీ వారు తలదించుకుంటున్నారు.

First Published:  5 Oct 2019 8:07 PM GMT
Next Story