రైతు భరోసాకు ప్రధాని రాకపోవచ్చు…

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15న ప్రారంభించనున్న రైతు భరోసా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ రాకపోచ్చని ఢిల్లీ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం మోడీతో సమావేశమైన జగన్‌ మోహన్ రెడ్డి … రైతు భరోసా ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

ఈనెల 11 నుంచి ప్రధాని అనేక కార్యక్రమాలతో బిజీగా ఉండనున్నారు. దాంతో ఆయన ఏపీకి రాకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 11న చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ భారత్ పర్యటనకు వస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన ఉంటుంది.

ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల 15న మోడీ ఏపీ పర్యటన సాధ్యం కాకపోవచ్చంటున్నారు.